Magic Movements | పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ – మీరు అనుకున్నది కాదు!
శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ మరియు శ్రీ లక్ష్మీ శ్రీనివాస బ్యానర్లపై ప్రముఖ దర్శకుడు కే. దశరథ్ సమర్పణలో తెరకెక్కుతున్న నూతన చిత్రం ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్ (మీరు అనుకున్నది కాదు)’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ మరియు శ్రీ లక్ష్మీ శ్రీనివాస బ్యానర్లపై ప్రముఖ దర్శకుడు కే. దశరథ్ సమర్పణలో తెరకెక్కుతున్న నూతన చిత్రం ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్ (మీరు అనుకున్నది కాదు)’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. తల్లాడ సాయి కృష్ణ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో, ఆసక్తికరమైన టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ, ప్రేక్షకులకు ఒక మంచి సినిమాటిక్ అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎస్.ఎస్. వెంకటేష్ అద్భుతమైన బాణీలు సమకూర్చే సన్నాహాల్లో ఉన్నారని, ఈ సినిమాకు సంగీతం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను ప్రేక్షకులతో పంచుకుంటామని ఆయన వెల్లడించారు.
ఈ చిత్రంలో తల్లాడ సాయి కృష్ణ, ఏకాదంతాయ సిరి, వాసు ఇంటూరి, 30 ఇయర్స్ పృథ్వీ, సీనియర్ నటి శ్రీలక్ష్మి, జబర్దస్త్ జీవన్, కిషోర్ దాస్, ఆకెళ్ల, జబర్దస్త్ అప్పారావు, వినోద్ నువ్వుల, గడ్డం నవీన్, చంద్ర సుబ్బగారి, వెంకట్ దుగ్గిరెడ్డి, స్వప్న అమ్మినేని, తల్లాడ వెంకన్న, అను, భాను, శోభన్ భోగరాజు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: శివ రాథోడ్, రచన: జీవన్ కందుల, సంగీతం: ఎస్.ఎస్. వెంకటేష్, ఎడిటింగ్: మోహన్, డిఐ: రోహిత్, ఆడియోగ్రఫీ: ఎస్.ఎస్. వెంకట్, ఎస్ఎఫ్ఎక్స్: వెంకట్, సహ నిర్మాతలు: వెంకట్ దుగ్గిరెడ్డి మరియు సుబ్బగారి చంద్ర రెడ్డి, నిర్మాత: తల్లాడ శ్రీనివాస్, సమర్పణ: కే. దశరథ్, కథ-కథనం-దర్శకత్వం: తల్లాడ సాయి కృష్ణ వ్యవహరిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

