టాలీవుడ్ యువ హీరో విశ్వక్సేన్ (Vishwak Sen), యాక్షన్ కింగ్ అర్జున్ (సార్జా) (Arjun Sarja) డైరెక్షన్లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విశ్వక్ సేన్ 11వ (Vishwak Sen) ప్రాజెక్టుగా రాబోతున్న ఈ చిత్రంలో అర్జున్ కూతురు ఐశ్వర్యా అర్జున్ (Aishwarya Arjun) ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ఫిలింనగర్ లో హల్చల్ చేస్తోంది. ఈ చిత్రానికి పాపులర్ రైటర్ సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందించబోతున్నారు.
ప్రొడక్షన్ నంబర్ 15గా వస్తున్న ఈ ప్రాజెక్టులో సాయిమాధవ్ బుర్రా (Sai Madhav Burra) జాయిన్ అవుతున్న విషయాన్ని తెలియజేస్తూ..ప్రయాణం త్వరలో ప్రారంభం అంటూ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఐశ్వర్యా అర్జున్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రాన్ని హోంబ్యానర్ శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్పై తెరకెక్కిస్తున్నాడు అర్జున్. ఈ చిత్రానికి అర్జున్ స్వయంగా కథనందించడం విశేషం. జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు.
రీసెంట్ గా అశోకవనంలో అర్జుణ కళ్యాణం సినిమాతో మంచి హిట్టు అందుకున్నాడు విశ్వక్ సేన్. ఈ సారి ఎలాంటి కథతో రాబోతున్నాడోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్.
Dialogue Writer✍🏻 @saimadhav_burra joins @srfioffl's Production No.15✨
🌟ing @VishwakSenActor
& Introducing @aishwaryaarjun in TFIWritten, Directed & Produced by
'Action King' @akarjunofficialJourney begins soon@IamJagguBhai #VishwakSen11 pic.twitter.com/g6G15qCxOk
— Vamsi Kaka (@vamsikaka) June 21, 2022
Read Also : Venu Udugula | విరాటపర్వం డైరెక్టర్‌తో పవన్ కల్యాణ్ సినిమా పరిస్థితేంటి..?
Read Also : Telugu film workers | సినీ కార్మికుల సమ్మె..రేపటి నుంచి షూటింగ్స్ బంద్
Read Also : Ganesh Acharya | విష్ణు, సన్నీ, పాయల్‌తో బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ స్టెప్పులు