Pooja Hegde | తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు టాప్ హీరోలందరి సరసన వరుసగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే, గత కొన్నేళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఆమె నటించిన కొన్ని పెద్ద సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయిన స్టార్ ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. గ్లామర్, డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ లాంటి అంశాల్లో పూజాతో సరితూగే వారు లేరని చెప్పాలి. అల్లు అర్జున్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ వంటి అగ్రనటులతో నటించటం ఆమె కెరీర్‌కే ప్రత్యేక గుర్తింపునిచ్చింది
వరుస ఫ్లాప్‌ల వల్ల లీడ్ రోల్స్ తగ్గినా, పూజా మాత్రం వెనక్కి తగ్గలేదు. హీరోయిన్గా కాకపోయినా, స్పెషల్ సాంగ్స్, స్పెషల్ రోల్స్ చేసుకుంటూ తన స్టార్ ప్రెజెన్స్‌ను కొనసాగించాలని నిర్ణయించుకుంది. ‘కూలీ’ సినిమాలో ‘మౌనిక’ సాంగ్ విజయంతో పూజా మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఆమె డాన్స్, లుక్స్, గ్లామర్ ఆ పాటను దక్షిణాది వ్యాప్తంగా వైరల్ చేశాయి. ఈ సాంగ్ హిట్ తర్వాత పూజాకు స్పెషల్ సాంగ్ ఆఫర్లు వరుసగా వస్తున్నాయి. ఇండస్ట్రీ టాక్ ప్రకారం, అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్‌లోని ప్రత్యేక గీతం కోసం పూజా హెగ్డేను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ సాంగ్ కోసం ఆమెకు రూ.5 కోట్లు పారితోషికం ఆఫర్ చేసినట్లు టాలీవుడ్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి..
ఒక ఐటెమ్ సాంగ్‌కి ఇది అరుదైన భారీ రేమ్యునరేషన్. ఇది పూజా మార్కెట్ ఇంకా బలంగానే ఉందని మరోసారి నిరూపిస్తోంది. సినిమా అవకాశాలు తగ్గినా, సోషల్ మీడియాలో మాత్రం పూజా హాట్ ఫేవరెట్. 2010లో మిస్ ఇండియా పోటీలో రెండోస్థానం సాధించి గ్లామర్ రంగంలోకి అడుగుపెట్టిన పూజా హెగ్డే 2012లో తమిళం ‘ముగమూడి’ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2014లో వరుణ్ తేజ్ సరసన ‘ముకుంద’ తో టాలీవుడ్‌కి పరిచయం కాగా, ఆ తర్వాత ‘ఒక లైలా కోసం’, బాలీవుడ్లో ‘మోహెంజో దారో’ వంటి సినిమాలతో ప్రయాణం కొనసాగించింది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలకంటే స్పెషల్ సాంగ్లపైనే దృష్టి పెడుతుంది. స్పెషల్ సాంగ్‌లతో తన మార్కెట్‌ను తిరిగి స్ట్రాంగ్ చేసుకుంటున్న పూజా, త్వరలోనే మళ్లీ స్టార్ హీరోల సరసన హీరోయిన్గా కనిపించే అవకాశాలు బలంగా ఉన్నాయని ఇండస్ట్రీ టాక్.