Pooja Hegde | అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఒకలైలా కోసం అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ తర్వాత మెల్లమెల్లగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. మధ్యలో ఈ బ్యూటీకి వరుస హిట్స్ రావడంతో స్టార్ హీరోయిన్ అయింది. ఇక పూజా కెరీర్‌కి తిరుగు లేదు అని అనుకునే సమయంలో గ్రాఫ్ పడిపోయింది. వరుస ఫ్లాపులతో సినిమా అవకాశాలు అందిపుచ్చుకోవడమే కష్టం అయింది. ఇక వచ్చిన అవకాశాలు కూడా మెల్లమెల్లగా జారిపోతున్నాయి. దీంతో పూజా హెగ్డే కెరీర్ డైలమాలో పడింది. ప్రభాస్ తో రాధే శ్యామ్ చేసిన అమ్మడు ఆ నెక్స్ట్ మహేష్ తో గుంటూరు కారం చేసే ఛాన్స్ అందుకుంది. కాని ఎందుకో మధ్యలో తప్పుకుంది.
ఆ తర్వాత తెలుగు సినిమాలు పూజాని పలకరించడం లేదు. ఇటీవల రెట్రో సినిమా ప్రమోషన్ సమయంలో పూజా హెగ్డే ఒక తెలుగు సినిమా చేస్తున్నట్టు వెల్లడించింది. ఐతే ఆ టీం అఫీషియల్ గా అనౌన్స్ చేసే దాకా వెయిట్ చేయాలని చెప్పింది. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుండి పూజాని తప్పించారని టాక్. సూర్య సినిమాలో నటించిన పూజా పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదని, అందుకే ఆమెని తప్పించారని ఇన్సైడ్ టాక్. అది నిజమా కాదా అన్నది మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశాక తెలుస్తుంది. ఏది ఏమైన పూజాకి ఇప్పుడు టఫ్ టైం నడుస్తుందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.
తెలుగులో అవకాశాలు దక్కించుకోలేకపోతున్న పూజా బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకుంటుంది. వరుణ్ ధావన్ తో సినిమాకు రెడీ అవుతుంది. ఈ సినిమా హిట్ అయితే సౌత్‌లో పూజాని కనికరించే ఛాన్స్ ఉంది. పూజా ఎప్పటికప్పుడు సౌత్ మీద తన ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంది. రామ్ చరణ్ నటిస్తున్నపెద్ది సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తుందని ఇటీవల ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై క్లారిటీ అయితే రాలేదు. ఇక ఇదిలా ఉంటే టాలీవుడ్ ఫ్యాన్స్ పూజాకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, తనేంటో నిరూపించుకుంటుంది అని అంటున్నారు.