Pooja Hegde | పూర్వ వైభవం కోసం పూజాహెగ్డే.. రెండు భారీ ప్రాజెక్ట్‌లలో కథానాయికగా!
అగ్ర కథానాయిక పూజాహెగ్డేకు గత రెండేళ్లుగా అంతగా కలిసి రావడం లేదు. తెలుగులో ‘అల వైకుంఠపురములో’ తర్వాత ఒక్క విజయాన్ని దక్కించుకోలేకపోయింది.
Pooja Hegde | అగ్ర కథానాయిక పూజాహెగ్డేకు గత రెండేళ్లుగా అంతగా కలిసి రావడం లేదు. తెలుగులో ‘అల వైకుంఠపురములో’ తర్వాత ఒక్క విజయాన్ని దక్కించుకోలేకపోయింది. కెరీర్ వరుస వైఫల్యాలతో కొనసాగుతున్నా ఏ మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా తిరిగి పూర్వ వైభవాన్ని సాధిస్తాననే ధీమాతో ఉంది పూజాహెగ్డే. తాజా సమాచారం ప్రకారం ఈ భామ రెండు భారీ ప్రాజెక్ట్‌లలో భాగం కానున్నట్లు తెలిసింది. ‘పుష్ప-2’ చిత్రం తర్వాత అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్నారని వార్తలొస్తున్నాయి. బన్నీకి కథ చెప్పానని, ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయని అట్లీ ఓ సందర్భంలో తెలిపారు. ఈ సినిమాలో పూజాహెగ్డే కథానాయికగా నటించనుందని తమిళ మీడియాలో వార్తలొస్తున్నాయి.
ఇక మరో సినిమా విషయానికొస్తే… నందినీ రెడ్డి దర్శకత్వంలో సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. తొలుత ఇందులో సమంతను నాయికగా అనుకున్నారట. అయితే ప్రస్తుతం ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోవడంతో ఆమె స్థానంలో పూజాహెగ్డేను కథానాయికగా ఎంపిక చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఒకవేళ ఈ రెండు సినిమాల్లో పూజాహెగ్డే నాయికగా ఖరారైతే కెరీర్ తిరిగి పుంజుకుంటుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

