మణిరత్నం (Mani Ratnam) డ్రీమ్ ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ (Ponniyin Selvan). తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రెండు పార్టులుగా తెరకెక్కుతుంది. పొన్నియన్ సెల్వన్-1 (Ponniyin Selvan-1) సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చెన్నైలో జరిగిన ఈవెంట్లో ట్రైలర్, ఆడియోను లాంఛ్ చేశారు. ఈవెంట్లో రజినీకాంత్, కమల్‌హాసన్, జయరాం, కాళిదాసు, సుహాసిని, మణిరత్నంతోపాటు నటీనటులు, పలువురు ప్రముఖులు సందడి చేశారు.
పొన్నియన్ సెల్వన్-1లో విక్రమ్, శరత్‌కుమార్, ప్రకాశ్ రాజ్, పార్థీబన్, ఐశ్వర్యా రాయ్, కార్తీ, జయం రవి, అరవింద్ స్వామి, త్రిష, జయరామ్, విక్రమ్ ప్రభు, శోభితా ధూళిపాళ కీ రోల్స్ చేస్తున్నారు. విక్రమ్ ఈ చిత్రంలో చోళ చక్రవర్తి ఆదిత్య కరికాలన్ పాత్రలో నటిస్తున్నాడు.
కార్తీ వల్లవరాయన్ వండియదేవన్ గా, ఐశ్వర్యారాయ్ క్వీన్ నందినిగా నటిస్తోంది. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విక్రమ్ ఈ సినిమా కోసం ఐదు భాషల్లో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకుంటుడం విశేషం.
Read Also : Naga Shaurya | పార్టీ మూడ్‌లో నాగశౌర్య..స్పెషల్ ఏంటంటే..?
Read Also : Ahimsa | ‘అహింస’ షూటింగ్ పూర్తి..రిలీజ్ డేట్ చెప్పనున్న తేజ టీం..!
Read Also : Bigg Boss 6 Telugu | గీతూ, ఇనయా సుల్తానా మధ్య వార్..మొదటి టాస్క్ ఇదే..!