Ponniyin Selavan-2 Movie on Ott | ఎలాంటి చప్పుడు చేయకుండా గతవారం రెంటల్ పద్దతిలో ‘పొన్నియన్ సెల్వన్-2’ ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమాను చూడాలంటే రూ.399 చెల్లించాలని ప్రకటించింది. ఇక తెలుగులో పెద్దగా అంచనాల్లేకుండానే విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను కొసమెర కూడా ఆకట్టుకోలేకపోయింది. తమిళం సంగతి అటుంచితే తెలుగులో మాత్రం ఘోరంగా ఫ్లాప్ అయింది. ఒకరకంగా చెప్పాలంటే తొలిపార్టు బ్రేక్ ఈవెన్ దరిదాపుల్లోకి వచ్చి ఆగిపోయింది. కానీ సెకండ్ పార్ట్ పబ్లిసిటీ ఖర్చులు కూడా వెనక్కి తీసుకురాలేకపోయింది. ఇక ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు. వాళ్ల ఎదురు చూపులకు అమెజాన్ ట్విస్ట్ ఇస్తూ రెంటల్ పద్దతిలో ఈ సినిమాను తీసుకొచ్చింది.
కాగా తాజాగా ప్రైమ్ సంస్థ రెంట్ పద్దతిని తొలిగించింది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను ప్రైమ్ మెంబర్ షిప్ ఉన్న వాళ్లు ఉచితంగా చూసే వెసలుబాటు కల్పించింది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను కల్కి రాసిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా మణిరత్నం తెరకెక్కించాడు. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష వంటి స్టార్లు ఈ సినిమాలో నటించారు. ఏ.ఆర్ రెహమాన్ స్వరాలు అందించాడు. ఇక తమిళంలో అటో ఇటో గట్టెక్కిన ఈ సినిమా.. మిగితా భాషల్లో మాత్రం నిరాశపరిచింది. ఇక తొలిపార్టు వల్ల దిల్‌రాజుకు లాభాల పంట పండకపోయినా.. నష్టాలు మాత్రం రాలేవు. కానీ సెకండ్ పార్ట్ మాత్రం కాస్త నష్టాలే మిగిల్చింది.