అపరిచితుడితో అమితాబ్ సవారి
సుదీర్ఘమైన కెరీర్లో ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందుకున్నారు బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్. ఏనభై ఏండ్ల వయసులో కూడా ఇప్పటికి వృత్తిపట్ల ఆయన అదే నిబద్దత, అంకితభావాన్ని ప్రదర్శిస్తారు. ముఖ్యంగా సమయపాలనకు అమితాబ్ అధిక ప్రాధాన్యతనిస్తారని చెబుతారు.
సుదీర్ఘమైన కెరీర్లో ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందుకున్నారు బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్. ఏనభై ఏండ్ల వయసులో కూడా ఇప్పటికి వృత్తిపట్ల ఆయన అదే నిబద్దత, అంకితభావాన్ని ప్రదర్శిస్తారు. ముఖ్యంగా సమయపాలనకు అమితాబ్ అధిక ప్రాధాన్యతనిస్తారని చెబుతారు. చెప్పిన సమయానికి సెట్లో ఉండాలన్నది ఆయన సిద్ధాంతం. తాజా ఘటనతో ఆయన ఈ విషయాన్ని మరో మారు రుజువు చేశారు. ట్రాఫిక్ జామ్ వల్ల షూటింగ్‌కు ఆలస్యమవుతుండటంతో రోడ్డుపై వెళుతున్న ఓ అపరిచిత యువకుడిని లిఫ్ట్ అడిగి బైక్‌పై షూటింగ్ స్పాట్‌కు చేరుకొని తన క్రమశిక్షణ చాటుకున్నారు.
అమితాబ్ బచ్చన్ ముంబయి వీధుల్లో బైక్‌పై వెళుతున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. తనకు లిఫ్ట్ ఇచ్చిన యువకుడికి ధన్యవాదాలు చెబుతూ అమితాబ్ బచ్చన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘నీ గురించి నాకు తెలియదు. కానీ ట్రాఫిక్ జామ్‌లో నన్ను సమయానికి షూటింగ్ లొకేషన్‌కు చేర్చావు. నీ సహాయానికి కృతజ్ఞతలు’ అని ఆయన పేర్కొన్నారు. అమితాబ్ బచ్చన్ సింప్లిసిటీ, వృత్తిపట్ల ఆయన నిజాయితీని చూసి నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

