Phalana Abbayi Phalana Ammayi Movie | ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి టైటిల్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్లో కొన్ని కాంబోలకు మంచి పేరుంది. వాళ్ల కలయికలో సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రెటీలు సైతం ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలలో శ్రీనివాస్ అవసరాల-నాగశౌర్య కాంబినేషన్ ఒకటి.
Phalana Abbayi Phalana Ammayi Movie | టాలీవుడ్లో కొన్ని కాంబోలకు మంచి పేరుంది. వాళ్ల కలయికలో సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రెటీలు సైతం ఆసక్తితో ఎదురు చూస్తుంటారు. అలాంటి కాంబోలలో శ్రీనివాస్ అవసరాల-నాగశౌర్య కాంబినేషన్ ఒకటి. గతంలో వీళ్ల కలయికలో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానందా’ సినిమాలు కల్ట్ క్లాసిక్స్‌గా మిగిలిపోయాయి. ఈ రెండు సినిమాలు కమర్షియల్‌గా భారీ విజయాలు సాధించకపోయినా.. ఇప్పటికీ టీవీల్లో వస్తున్నాయంటే కన్నార్పకుండా చూస్తుంటాం. కాగా ఏడేళ్ల తర్వాత మళ్లీ వీళ్ల కలయికలో ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే న్యూఏజ్ లవ్‌స్టోరీ తెరకెక్కుతుంది.
ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమాలోని టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేసింది. లేటెస్ట్గా రిలీజైన ఈ సాంగ్ శ్రోతలను తెగ ఆకట్టుకుంటుంది. స్మూతి మ్యూజిక్‌తో ఒక కొత్త ఫీల్ కలుగుతుంది. కళ్యాణ్ మాలిక్ గొంతులో ఈ పాట మరింత అద్భుతంగా అనిపిస్తుంది. భాస్కరబట్ల సాహిత్యం కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఇప్పటికే రిలీజైన కన్నులచాటు మేఘమా పాటకు విశేష స్పందన వచ్చింది. రోమ్ కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా మాళవికా నాయర్ నటిస్తుంది. మార్చి 17న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pulivendula | పులివెందుల పుర పోరులు టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్లదాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
Radhika Apte | ఇన్నర్స్ లేకుండా యాక్షన్ సీన్ చేయాలన్నారు.. రెండు వారాలు వేధించారు: రాధికా ఆప్టే
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

