Peddi | మెగా హీరో రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా విడుదల తేదీ మరోసారి మారే సూచనలు కనిపిస్తున్నాయి. మొదట మార్చి 27న విడుదల చేస్తామని ప్రకటించిన మేకర్స్, ఆ తర్వాత ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. అయితే ఆ తేదీకి కూడా సినిమా సిద్ధం కాలేకపోవడంతో జూన్ 25కి రిలీజ్‌ను షిఫ్ట్ చేశారు. తాజాగా ఇప్పుడు ఆ తేదీ కూడా మారవచ్చనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా జూన్ 25న సినిమా విడుదల అవుతుందని అధికారికంగా ప్రకటించినప్పటికీ, అదే సమయంలో అఖిల్ అక్కినేని నటిస్తున్న లెనిన్ మూవీ జూన్ 26న విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద పోటీ నెలకొనే అవకాశాలు ఉన్నాయనే చర్చలు మొదలయ్యాయి.
మొదట ‘లెనిన్’ సినిమాను మే 1న రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, ‘పెద్ది’ కోసం వాయిదా వేసినట్లు టాక్. కానీ ఇప్పుడు చరణ్ సినిమా ఒక రోజు ముందే విడుదల కానుండటంతో, రెండు పెద్ద సినిమాలు బ్యాక్ టు బ్యాక్‌గా వస్తాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రీసెంట్గా నాగార్జున.. ‘లెనిన్’ ఫస్ట్ కాపీ చూసినట్లు చెప్పుకొచ్చారు. “కొత్త అఖిల్‌ను ప్రేక్షకులు చూడబోతున్నారు” అంటూ జూన్ 26 తేదీని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. దీంతో అక్కినేని కుటుంబం ఈసారి వెనక్కి తగ్గేలా కనిపించడం లేదని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక చిరంజీవి – నాగార్జున కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉండటంతో, ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతాయా? అనే సందేహాలు మరింత పెరిగాయి.
గతంలో ఒకసారి ‘లెనిన్’ వాయిదా పడిన నేపథ్యంలో, మళ్లీ అదే పరిస్థితి వస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే సమయంలో యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమా విడుదల తేదీ మారడం ‘పెద్ది’కి కొత్త ఆప్షన్‌గా మారింది. ముందుగా మార్చిలో విడుదల చేయాలని భావించిన ఈ చిత్రం, తర్వాత జూన్ 4కి వాయిదా పడింది. తాజాగా మళ్లీ మారే అవకాశాలు ఉండటంతో, అదే తేదీకి ‘పెద్ది’ని తీసుకురావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. సమ్మర్ హాలిడేస్ జూన్ మధ్యవరకు ఉండటంతో, జూన్ 25 కంటే ముందే రిలీజ్ చేస్తే కలెక్షన్లకు ప్లస్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌కు కూడా ఇది అనుకూలంగా ఉంటుందని అంటున్నారు. ఇక మెగా అభిమానులు మాత్రం ‘టాక్సిక్’ తేదీకి ‘పెద్ది’ రావాలని కోరుకుంటున్నారు. చూడాలి మేకర్స్ చివరకు ఏ తేదీని ఫైనల్ చేస్తారనేది.