Peddi | రామ్ చరణ్ తన తాజా చిత్రం పెద్ది కోసం చేసిన బీస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గ్రామీణ క్రికెటర్‌గా కనిపించిన చరణ్, తాజాగా విడుదలైన టీజర్లో పహిల్వాన్‌గా రఫ్ లుక్‌లో దర్శనమివ్వడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్లో చరణ్ మట్టి అఖారాలో కుస్తీలు పడుతూ కనిపించారు. ఈ లుక్ వెనుక ఆయన పెట్టిన కష్టం అందరిని ఆకట్టుకుంటుంది. గత ఎనిమిది నెలలుగా ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకే లేచి కఠినమైన వ్యాయామాలు, శిక్షణ తీసుకుంటూ ఈ ఫిజిక్‌ను సాధించినట్లు సమాచారం.అత్యంత ఆసక్తికర విషయం ఏమిటంటే, చరణ్ ఈ బాడీని పూర్తిగా శాఖాహారంతోనే బిల్డ్ చేయడం.
ఇటీవల ఆయన అయ్యప్ప స్వామి దీక్షలో ఉండి మాల ధరించి కనిపించిన సంగతి తెలిసిందే. అంటే ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తూ కూడా ఈ స్థాయి ఫిజిక్ సాధించడం విశేషంగా మారింది.శిక్షణలో భాగంగా ‘గద’ (ముగ్ధార్) అనే సాంప్రదాయ వ్యాయామ పరికరాన్ని విస్తృతంగా ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇది బరువైన చెక్కతో తయారైన సాధనం. టీజర్లో చరణ్ గదను తిప్పుతూ పోరాట సన్నివేశాల్లో కనిపించడం ఈ శిక్షణకు నిదర్శనం.సాధారణంగా కండలు పెంచాలంటే మాంసాహారం అవసరం అనే అభిప్రాయం ఉన్నప్పటికీ, చరణ్ మాత్రం ప్రకృతి సిద్ధమైన కూరగాయలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలతోనే ఈ ఫిట్నెస్ను సాధించి కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో అంతర్జాతీయ స్థాయి ఫిజిక్ సాధ్యమని ఆయన నిరూపించారు.
గతంలో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, వివేక్ ఒబెరాయ్ వంటి నటులు కూడా శాఖాహారంతోనే ఫిట్నెస్ను మెయింటైన్ చేస్తూ ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు చరణ్ కూడా అదే మార్గంలో నడుస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. సినిమాలో చరణ్ పాత్ర మొదట క్రికెట్ నేపథ్యంతో పరిచయమై, తర్వాత పహిల్వాన్‌గా మారే ప్రయాణం చూపించనున్నారు. ఈ కథలో ఆయన శారీరక, మానసిక మార్పులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. ఏప్రిల్ 30న విడుదల కానున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు మంచి స్పందన తెచ్చుకుంటున్నాయి. గత ఫెయిల్యూర్ తర్వాత చరణ్ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.