Peddi | మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో రూపొందుతున్న అవైటెడ్ మూవీ ‘పెద్ది (Peddi)’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. షూటింగ్ మొదలైనప్పటి నుంచే ఈ సినిమా ప్రతి అప్డేట్ టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి సాంగ్ ‘చికిరి చికిరి’ ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిలీజ్ అయిన కొద్ది రోజులకే ఈ పాట సోషల్ మీడియా, యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లలో దుమ్మురేపింది. ముఖ్యంగా తెలుగు వెర్షన్‌కు వచ్చిన రెస్పాన్స్ అదిరిపోయింది. భారీ రీచ్తో ఈ సాంగ్ 150 మిలియన్ వ్యూస్‌ను దాటేయడం విశేషం. ఇది ‘పెద్ది’ క్రేజ్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది.
‘చికిరి చికిరి’ బ్లాక్‌బస్టర్ విజయంతో ఇప్పుడు అందరి చూపు నెక్స్ట్ సాంగ్ మీదే ఉంది. ఈ పాట గురించి ఇండస్ట్రీలో క్రేజీ బజ్ వినిపిస్తోంది. సమాచారం ప్రకారం, ఈ సాంగ్ ఒక సాలిడ్ మాస్ నెంబర్‌గా ఉండబోతుందట. రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు ఫుల్ మాస్ ట్రీట్ ఇవ్వబోతున్న ఈ పాటపై స్పష్టత నెలాఖరుకు రానున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మరో ఆసక్తికర చర్చ కూడా నడుస్తోంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉంటుందని టాక్. ఆ పాటలో మృణాల్ ఠాకూర్ కనిపిస్తే బాగుంటుందని అభిమానులు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. అయితే ఆమెనే ఎంపిక చేశారా లేదా అన్నదానిపై ఇంకా అధికారిక క్లారిటీ రాలేదు. కానీ ఓ స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్‌లో కనిపించే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
‘పెద్ది’ సినిమాకు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండటం ఈ ప్రాజెక్ట్‌కు మరో పెద్ద ప్లస్. ఇప్పటికే విడుదలైన పాటతోనే ఆయన మ్యాజిక్ కనిపించగా, రాబోయే సాంగ్స్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ భారీ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. మొత్తానికి… పాటలతోనే కాదు, కంటెంట్ పరంగానూ ‘పెద్ది’ టాలీవుడ్లో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఇక నెక్స్ట్ సాంగ్ అప్డేట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.