కొత్త సీన్స్ యాడ్ అవుతున్నాయి
అగ్ర హీరో రామ్‌చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ‘పెద్ది’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించి, ఈ ఏడాది సౌతిండియా నంబర్‌వన్ గ్రాసర్‌గా నిలిచిందని చిత్ర నిర్మాత వెంకటసతీశ్ కిలారు తెలిపారు.
అగ్ర హీరో రామ్‌చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ‘పెద్ది’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించి, ఈ ఏడాది సౌతిండియా నంబర్‌వన్ గ్రాసర్‌గా నిలిచిందని చిత్ర నిర్మాత వెంకటసతీశ్ కిలారు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో సక్సెస్ ప్రెస్‌మీట్‌ని నిర్వహించారు. దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాత వెంకటసతీశ్ కిలారు, గేయరచయిత అనంతశ్రీరామ్, మైత్రీ శశి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘నటుడిగా రామ్‌చరణ్‌ని ఉన్నత స్థానంలో నిలబెట్టిన సినిమా ‘పెద్ది’. చిరంజీవిగారు సినిమా చూసి మెచ్చుకున్నారు.
కొత్తగా ఓ నాలుగు సన్నివేశాలను జోడిస్తున్నాం. వాటిలో హీరోయిన్ జాన్వీకి చెందిన సీన్స్ మూడైతే, జగపతిబాబుకు చెందిన సన్నివేశం ఒకటి. బుధవారం నుంచి అవి యాడ్ అవుతాయి’ అని దర్శకుడు బుచ్చిబాబు తెలిపారు. ఆదివారం నుంచి టికెట్ రేట్లు కూడా తగ్గిస్తున్నట్టు, అన్ని ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టు నిర్మాత సతీశ్ కిలారు తెలిపారు. మంచి మోటివేషన్‌తో తీసిన ఇలాంటి సినిమా ఇంత కమర్షియల్‌గా రావడం చరిత్రలో లేదని, నేటి తరానికి సందేశంతోపాటు వినోదాన్ని కూడా పంచిన సినిమా ‘పెద్ది’ అని, రోజురోజుకీ ఆదరణ పెరుగుతున్నదని’ పంపిణీదారుడు మైత్రీ శశి అన్నారు. ఇంకా అనంతశ్రీరామ్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

