టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో దిల్‌రాజు ఒకడు. ఈయన నుంచి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అనే విధంగా ఉంటుంది. తెలుగు ప్రేక్షకుల పల్స్ ఈయనకు బాగా తెలుసు. ముఖ్యంగా ఈయన సినిమాలకు ఫ్యామిలీ ఆడియెన్స్ ఎక్కువగా ఉంటారు. ఈయన కూడా ఫ్యామిలీ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమాలను తీస్తుంటాడు. ప్రస్తుతం ఈయన నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్-3’. వెంకటేష్ వరుణ్ తేజ్ ప్రాధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. 2019లో సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన ‘ఎఫ్-2’కు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మే27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్లను జోరుగా జరుపుతుంది.
ప్రమోషన్లలో భాగంగా సినిమా గురించి మేకర్స్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ ప్రేక్షకులలో అటెన్షన్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే దిల్‌రాజు ‘ఎఫ్-3’ గురించి కొన్ని విషయాలను చెప్పాడు. ఈ చిత్రంలో పెద్ద సర్ప్రైజ్ ఉంటుందని.. తెర మీద పవన్ కళ్యాణ్ కనిపిస్తాడని చెప్పాడు. ఈ చిత్రం ఖచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని తెలిపాడు. ఇక పవన్ కళ్యాణ్ తెరపై కనిపించనున్నట్లు తెలుపడంతో కళ్యాణ్ అభిమానులు సంతోషంతో మునిగిపోతున్నారు. పవన్ ఈ చిత్రంలో ఏ పాత్రలో, ఎంత నిడివితో కనిపిస్తాడనే ఆసక్తి ప్రేక్షకులలో నెలకొంది. తమన్నా, మెహరీన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సునీల్, సోనాల్ చౌహన్ కీలకపాత్రల్లో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.