Pawan Kalyan | టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ నయా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడని.. ఇందులో భాగంగానే మోహన్ రాజా, దేవా కట్టాతో చర్చలు కూడా జరుపుతున్నాడని నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై పవన్ కల్యాణ్ టీం క్లారిటీ ఇచ్చింది.
ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ ఎలాంటి కొత్త ప్రాజెక్టుల కమిట్మెంట్స్ను తీసుకోవడం లేదు. కొత్త సినిమాలపై వస్తున్న పుకార్లు అవాస్తవం. ఇప్పటికైతే కొత్త సినిమాలను మొదలుపెట్టే ప్లాన్ ఏం లేదు. అలాంటిది ఏదైనా అప్డేట్ ఉంటే అధికారిక ఛానళ్ల ద్వారా మీకు చేరవేస్తాం. ఓజీ 2 విషయంలో ఏదైనా అప్డేట్ ఉంటే సరైన సమయంలో పవన్ కల్యాణ్ స్వయంగా తెలియజేస్తారని వెల్లడించింది.
ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ ఇప్పటికే సురేందర్ రెడ్డి డైరెక్షన్లో సినిమాకు సంతకం చేశాడని తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుదనేది మాత్రం ప్రస్తుతానికి క్లారిటీ లేదు. మరోవైపు అభిమానులు మాత్రం అన్నీ సరైన టైంలో పవన్ కల్యాణ్ ఓజీ 2 ట్రాక్‌లోకి తీసుకువస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి పవన్ కల్యాణ్ నుంచి నెక్ట్స్ ఏ ప్రాజెక్ట్ ముందు వరుసలో ఉండబోతుందన్నది మాత్రం సస్పెన్స్ నెలకొంది.
Mangli | మైక్రో ఫైనాన్స్ మోసాలపై సింగర్ మంగ్లీ క్లారిటీ.. నా పేరుతో డబ్బులు వసూలు చేస్తే నమ్మోద్దు..
Iran: మేం కూడా పవర్ ప్లాంట్లను ధ్వంసం చేస్తాం: ఇరాన్ వార్నింగ్