Pawan Kalyan | పవన్ టార్గెట్ 2024..మరి సినిమాల సంగతేంటి..!
ప్రజా జీవితంలో ఉంటూ..అభిమానులను ఎంటర్ టైన్ చేసేందుకు సినిమాలు చేస్తున్నాడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan). సోమవారం జనసేన ఆవిర్బావ సభలో 2024 ఏపీ ఎన్నికలే టార్గెట్ (Andhra Pradesh politics) అంటూ పవన్ సింహంలా గర్జించడం ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.
టాలీవుడ్ (Tollywood) హీరో, జనసేన అధినేత (Janasena Party) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలను బ్యాలెన్స్ చేయడం కష్టమైన పనే. ప్రజా జీవితంలో ఉంటూ..అభిమానులను ఎంటర్ టైన్ చేసేందుకు సినిమాలు చేస్తున్నాడు పవన్‌కల్యాణ్. ఇటీవలే భీమ్లానాయక్ సినిమాలో సిల్వర్ స్క్రీన్ పై జూలు విదిల్చిన పులిలా మెరిసిన పవన్‌కల్యాణ్..సోమవారం జనసేన ఆవిర్బావ సభలో 2024 ఏపీ ఎన్నికలే టార్గెట్ (Andhra Pradesh politics) అంటూ సింహంలా గర్జించడం ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.
ప్రశ్నించడమే బలమైన ఆయుధం అన్న పవన్‌కల్యాణ్..2024లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లబోతున్నట్టు ప్రకటించి జనసైనికుల్లో జోష్ నింపాడు. ఇప్పటివరకున్న పవన్ కల్యాణ్ వేరు..ఇప్పటి నుంచి వేరు అన్నట్టుగా పవన్ తాజా స్పీచ్ చూస్తే తెలిసిపోతుంది. 2024 అంటే కేవలం రెండేళ్ల సమయమే ఉంది. మరోవైపు పవన్ కల్యాణ్ చేతుల్లో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలున్నాయి.
Read Also : Alia Bhatt character | బ్రహ్మాస్త్ర నుంచి అలియాభట్ లుక్ అవుట్..వీడియో
క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు (Hari Hara Veera Mallu), హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ (Bhavadeeyudu Bhagat Singh), పీఎస్పీకే29, వినోధయ సీతమ్ రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పవన్. అయితే రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టే సమయం ఆసన్నమవడంతో మరి సినిమాల షెడ్యూల్ పరిస్థితి ఎలా ఉండబోతుందని ఇపుడు ఫ్యాన్స్ తెగ తర్జన భర్జన పడుతున్నారు.
Read Also : Mishan Impossible trailer | మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వేటతో ‘మిషన్ ఇంపాజిబుల్’ ఫన్ ట్రైలర్
తాజా పరిస్థితుల నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఇక నుంచి పొలిటికల్ మ్యాప్‌ను దృష్టిలో పెట్టుకొని సినిమాల షూటింగ్ షెడ్యూల్‌ను మార్చుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు సినీ విశ్లేషకులు. మరి పవన్ కల్యాణ్ ఇటు సినిమాలు, అటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ జనసేనను అధికారంలోకి తీసుకొచ్చే దిశగా ఎలాంటి ప్లాన్ తో ముందుకెళ్తారో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

