OG Movie Shooting Update | ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ఉన్నంత హ్యాపీగా ఏ హీరో అభిమాని లేడేమో. ఒకే సారి మూడు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లి అభిమానుల్లో పవన్ ఉత్సాహాం నింపాడు. గతేడాది చివరి వరకు హరిహర వీరమల్లును మాత్రమే చేతిలో పెట్టుకున్న పవన్ ఇప్పుడు ఏకంగా మరో మూడు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. అయితే ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్‌లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్న సినిమా మాత్రం ఓజీనే. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన ప్రీ పోస్టర్‌కే ఎక్కడలేని బజ్ క్రియేట్ అయింది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా షూటింగ్‌ను ఏప్రిల్ 14 నుంచి స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. కేవలం రెండు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసి ఆపై పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించేలా చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుందట. ఇప్పటికే సుజీత్, చిత్రయూనిట్‌తో కలిసి లోకేషన్లను చూసి ఫైనల్ కూడా చేశాడు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు టాక్. ఆర్ఆర్ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్‌ను నిర్మించిన దానయ్య ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు.
దీనితో పాటుగా పవన్ హరిహర వీరమల్లు అనే పీరియాడిక్ సినిమా చేస్తున్నాడు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక మేనల్లుడు సాయిధరమ్‌తో కలిసి నటిస్తున్న వినోదయ్ సిత్తం రీమేక్ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకు పి. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. వీటితో పాటుగా పవన్, హరీష్ శంకర్‌తో ఉస్తాద్ భగత్‌సింగ్‌ను కూడా లైన్లో పెట్టాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టనుంది.