Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ (OG) సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌లో పవన్ కళ్యాణ్ డబుల్ రోల్ లో కనిపించనున్నాడని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇది నిజమే అయితే, పవన్ కెరీర్లో ఇది తొలిసారి డబుల్ రోల్ కావడం విశేషం. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ రెండు పాత్రలు పోషించిన సినిమా ఏదీ రాలేదు. అయితే ఓజీ ద్వారా అభిమానులకు మామూలు సర్ప్రైజ్ ఇవ్వడం లేదని అర్ధమవుతుంది. ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం, పవన్ పోషిస్తున్న రెండు పాత్రలు కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది.
అందులో ఒకటి ఓజస్ అనే గంభీరమైన గ్యాంగ్‌స్టర్ క్యారెక్టర్ కాగా, మరొకటి ఓ ఎమోషనల్ & షాకింగ్ ట్విస్ట్‌తో కూడిన పాత్ర అని టాక్. ఈ విషయాలు బయటకు రావడంతో, పవన్ ఫ్యాన్స్‌లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి వంటి బిగ్ కాస్ట్ నటిస్తుండగా, సంగీతాన్ని ఎస్.ఎస్. థమన్, సినిమాటోగ్రఫీని రవి కె. చంద్రన్ అందిస్తున్నారు. విజువల్స్, మ్యూజిక్ పరంగా కూడా ఓజీ గ్రాండ్‌గా ఉండబోతుందని సమాచారం.పవన్ రాజకీయంగా బిజీగా ఉండటం వల్ల షూటింగ్ కొంత ఆలస్యం అయినప్పటికీ, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. డబుల్ రోల్ పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు కానీ, సినిమా యూనిట్ నుంచి లీక్ అవుతున్న అప్డేట్లు ఈ గాసిప్‌కి బలాన్నిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ మాస్, క్లాస్ లుక్లతో, డబుల్ డోస్ యాక్షన్, ఎమోషన్ మిక్స్‌తో ఓజీ ఒక పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఫ్యాన్స్ తో పాటు ట్రేడ్ వర్గాలు కూడా ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నాయి. హరిహర వీరమల్లు చిత్రంతో పవన్ అభిమానులు కాస్త నిరాశ చెందగా, ఇప్పుడు ఓజీతో మాత్రం వారికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత పవన్ నుండి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం రానుంది. ఈ మూవీపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.