పవన్ కల్యాణ్ ప్రస్తుతం మల్టిపుల్ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నారు. ఆయన ఖాతాలో ‘హరిహరి వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’తో పాటు ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) చిత్రాలున్నాయి. మరోవైపు రాజకీయ కార్యకలాపాలు కూడా పవన్‌ను తీరిక లేకుండా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాల్లో పవన్ ‘ఓజి’కి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైనర్ కథతో దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్నారు. ప్రియాంక మోహనన్ నాయికగా నటిస్తున్నది. ఈ నెల 14వ తేదీ వరకు ఈ చిత్ర షూటింగ్‌లోనే పవన్ పాల్గొంటారని తెలుస్తున్నది. 14 నుంచి రాజకీయ కార్యక్రమాలకు ఆయన సిద్ధమవుతున్నారు. పవన్‌తో దర్శకుడు హరీశ్ శంకర్ రూపొందిస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరి హర వీరమల్లు’ టీమ్స్ షూటింగ్ కోసం వేచి చూడాల్సి ఉంటుందని చెబుతున్నారు. ‘హరి హర వీరమల్లు’ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకోగా.. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ కొంతభాగమే షూటింగ్ జరుపుకుంది.