నేచురల్ స్టార్ నాని ఇప్పుడు నటుడిగాను, నిర్మాతగాను సత్తా చాటుతున్నాడు. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. త్వరలో హిట్ 3 అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించనున్నాడు. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం నిర్వహించారు. వేడుకకి రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రెగ్యులర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు భిన్నంగా… వెరైటీగా ఈ ఫంక్షన్ జరిగింది.
ఈ ఈవెంట్లో నాని మాట్లాడుతూ ఈ సినిమా కోసం అందరం కష్టపడి పనిచేశం. ఫుల్ ఎఫర్ట్ పెట్టాం. మంచి హిట్ కొట్టబోతున్నామనే నమ్మకం అందరిలో ఉంది. కళ్యాణ్ గారి స్టైల్లో చెప్పాలంటే మనల్ని ఎవడ్రా ఆపేది అని నాని డైలాగ్ పేల్చాడు. దీంతో ఆడిటోరియం ఒక్కసారిగా దద్దరిల్లింది. నాని నోటి నుండి పవన్ కళ్యాణ్ డైలాగ్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయిపోయారు. ప్రస్తుతం ఈ వీడియోని తెగ వైరల్ కూడా చేస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చిన రాజమౌళి. నానిపై ప్రశంసల వర్షం కురిపించాడు. తనను తొలిసారి కలిసినప్పుడు చాలా ఎత్తుకి వెళ్తాడని అనుకున్నాను. కానీ ఊహించిన దానికంటే ఇంకా ముందుకెళ్లిపోయాడు. తను ఇక్కడితో ఆగిపోకూడదు. ఇంకా ముందుకు వెళ్లాలని మేము కోరుకుంటూనే ఉంటాం. ఆల్ ద బెస్ట్ నాని’ అని ప్రసంగం ముగించారు రాజమౌళి.
అయితే నాని సినిమా చూసేందుకు ఉదయం ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్లకు రాజమౌళి ఫ్యామిలీ వెళ్లడం కొన్నేళ్లుగా జరుగుతూ ఉంది. ఇటీవల ఆ సెంటిమెంట్‌కి బ్రేక్ పడింది. అయితే హిట్ 3ని మాత్రం రాజమౌళి ఫ్యామిలీతో కలిసి చూస్తానని నాని పేర్కొన్నాడు. ఇక రాజమౌళి.. మహాభారతాన్ని సెట్స్ మీదకు తీసుకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. దానికి చాలా సమయం ఉందట. అయితే అది ఎప్పుడు తీసినా సరే… అందులో నాచురల్ స్టార్ నాని ఒక క్యారెక్టర్ చేస్తారని రాజమౌళి చెప్పడం కొసమెరుపు. ఇక హిట్ 3 చిత్రాన్ని శైలేష్ కొలను తెరకెక్కించారు. ఇందులో కేజిఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటించారు. అడవి శేష్ అతిథి పాత్ర చేశారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రం విడుదల కానుంది.
Kalyan gari style lo cheppali ante “Manalni evadra Aapedhi” – @NameisNani
Rooting for another big blockbuster! Here’s to the start of a new hit streak with #Hit3
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) April 27, 2025