Kota Srinivasa Rao | కోట కుటంబంతో మాకు స్నేహ బంధాలు ఉన్నాయి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ నోట్
Kota Srinivasa Rao | ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న కోట శ్రీనివాసరావు ఏకంగా 750 సినిమాలలో తన నటనతో అలరించారు.. ఆయన నేడు తెల్లవారుజామున వయోభారం, ఆరోగ్య సమస్యలతో మరణించారు. కోట ఇక లేరని తెలిసి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
Kota Srinivasa Rao | ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న కోట శ్రీనివాసరావు ఏకంగా 750 సినిమాలలో తన నటనతో అలరించారు.. ఆయన నేడు తెల్లవారుజామున వయోభారం, ఆరోగ్య సమస్యలతో మరణించారు. కోట ఇక లేరని తెలిసి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. కోట నటుడిగానే అందరికి తెలుసు. కానీ డబ్బింగ్ ఆర్టిస్టుగా కొన్ని తమిళ్ డబ్బింగ్ సినిమాలకు పనిచేసారు. అలాగే సింగర్ గా కూడా పాటలు పాడారు. కోట చేయని పాత్ర లేదంటే అతిశయోక్తి లేదు. ఆ తరం నుండి ఈ తరం వారితో కూడా కలిసి పని చేశారు.
కోట మృతిపై పలువురు ప్రముఖులు ఎమోషనల్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రెస్ నోట్ లో.. తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన శ్రీ కోట శ్రీనివాసరావు గారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తెలుగు తెరపై ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలు పోషించారు. తెలుగు భాష, యాసలపై ఆయనకు మంచి పట్టు ఉంది. ఓ పిసినారిగా, ఓ క్రూరమైన విలన్ గా, ఓ మధ్య తరగతి తండ్రిగా, ఓ అల్లరి తాతయ్యగా… ఏ పాత్రలోనైనా ఒదిగిపోయారు. 1999-2004 మధ్య శాసన సభ్యుడిగా సేవలందించారు.
శ్రీ కోట శ్రీనివాసరావు గారితో మా కుటుంబానికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అన్నయ్య చిరంజీవి గారు నటించిన ప్రాణం ఖరీదుతోనే శ్రీ కోట గారు చిత్ర సీమకు పరిచయం అయ్యారు. నా మొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయిలో ఆయన ముఖ్యమైన పాత్రలో ప్రేక్షకులను అలరించారు. ఆ తరవాత గోకులంలో సీత, గుడుంబా శంకర్, అత్తరింటికి దారేది, గబ్బర్ సింగ్ తదితర చిత్రాల్లో కలసి నటించాము. శ్రీ కోట శ్రీనివాసరావు గారు డైలాగ్ చెప్పే విధానం, హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. శ్రీ కోట శ్రీనివాసరావు గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని రాసుకొచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

