Pawan Kalyan | పవన్ కళ్యాణ్ లైనప్‌లో అందరినీ ఎగ్జైట్మెంట్కు గురి చేస్తున్న ప్రాజెక్ట్ ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఒక్క ప్రీలుక్ పోస్టర్‌తోనే సోషల్ మీడియా షేక్ అయిందంటే.. ఇక సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అనే ఊహే గూస్బంప్స్ తెప్పిస్తుంది. పైగా ఈ సినిమాలో పవన్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తున్నాడు. అప్పుడెప్పుడో పుష్కర కాలం ముందు పవన్ ‘పంజా’లో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించాడు. మళ్లీ ఇనేళ్ల తర్వాత గ్యాంగ్‌స్టర్ పాత్ర చేస్తుండటంతో సినిమాపై ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం అక్షరాల వంద కోట్లు రెమ్యునరేషన్ తీసుకోనున్నాడట. పవన్ క్రేజ్ చూసి నిర్మాత దానయ్య సైతం వంద కోట్లు ఇవ్వడానికి రెడీ అయ్యాడట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నిజానికి ఈ సినిమాకున్న హైప్ కు ఏ మాత్రం పాజిటీవ్ టాక్ వచ్చినా కోట్లు కొల్లగొట్టడం ఖాయం. పైగా సుజీత్ కేపబులిటీస్ గురించి తెలిసిందే. సాహో రిజల్ట్ ఎలా ఉన్నా సుజీత్ టేకింగ్ మాత్రం వేరే లెవల్. ఇక పవన్ కళ్యాణ్ కూడా ముందుగా ఓజీ సినిమాను పూర్తి చేయడమే ప్రయారిటీగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఇక జూన్ 8 నుంచి వరుసగా ఈ సినిమాకు డేట్స్ కేటాయించాడట పవన్ కళ్యాణ్. ఈ సినిమా పూర్తయిన తర్వాతే ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు షూటింగ్లలో పాల్గొననున్నాడట.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్‌ను నిర్మించిన దానయ్య ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ప్రస్తుతం పవన్ నటించిన బ్రో మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ మరో ప్రధాన హీరోగా నటిస్తున్నాడు.