దర్శకుడు క్రిష్‌కు తీపికబురు చెప్పిన పవన్ కళ్యాణ్..

Pawan kalyan bheemla nayak | పవన్ కళ్యాణ్‌తో సినిమా కమిట్ అయినప్పుడు నిర్మాతలు ఒక విషయంలో ధైర్యంగా ఉండాలి. అదే డేట్స్ విషయంలో.. ఈయన ఏ సినిమాకు ఎప్పుడు డేట్స్ చేస్తాడు అనేది ఏ నిర్మాతకు కూడా అర్థం కావడం లేదు. ఒక్కోసారి ముందు కమిట్ అయిన సినిమాల కంటే తర్వాత కమిట్ అయిన సినిమాలు త్వరగా పూర్తి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈయన ఒకేసారి ఐదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో తాజాగా భీమ్లా నాయక్ సినిమాను పూర్తి చేశాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోశీయుమ్ సినిమాకు రీమేక్ ఇది. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ తాజాగా పూర్తయింది.
భీమ్లా నాయక్ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. జనవరి 12న తమ సినిమా విడుదల కానున్నట్లు మరోసారి కన్ఫమ్ చేశారు దర్శక నిర్మాతలు. రాజమౌళి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ సినిమా యూనిట్ ను విజ్ఞప్తి చేసినా కూడా వాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. సంక్రాంతికి వస్తే తప్ప ఈ సినిమా వర్కవుట్ కాదనే ఉద్దేశంతోనే పవన్ రంగంలోకి దిగుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో క్రిష్ హరిహర వీరమల్లు సినిమాకు లైన్ క్లియర్ అయింది. నిజానికి సాగర్ కే చంద్ర సినిమాను క్రిష్ కంటే తర్వాత కమిట్ అయ్యాడు పవన్ కళ్యాణ్. కానీ ముందు దాన్ని పూర్తి చేశాడు. హరిహర వీరమల్లు సినిమా పూర్తిగా విజువల్ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ నేపథ్యంలో సాగే హిస్టారికల్ మూవీ.
ఈ సినిమాకు ఎక్కువ పని రోజులు కావాలి. పైగా లుక్ కూడా వేరేలా ఉంటుంది. అందుకే ముందు భీమ్లా నాయక్ పూర్తి చేసి ఇప్పుడు క్రిష్ సినిమా వైపు అడుగులు వేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇది కూడా 2022 లోనే విడుదల కానుంది. ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా పవన్ కళ్యాణ్ తో నిర్మించిన ఏఎం రత్నం దీనికి నిర్మాత. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా వస్తోంది. 16వ శతాబ్దం నాటి కోహినూరు వజ్రం నేపథ్యంలో హరిహర వీరమల్లు సినిమా వస్తుంది. ఇందులో బాలీవుడ్ హీరో అర్జున్ రామ్ పాల్ ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నాడు. నిధి అగర్వాల్ కథానాయిక. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. డిసెంబర్ మూడో వారం నుంచి హరిహర వీరమల్లు సినిమా షూటింగులో జాయిన్ కానున్నాడు పవన్ కళ్యాణ్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
నా సినిమాను ఉచితంగా ఆడిస్తా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ కామెంట్స్
పవన్‌కల్యాణ్ కన్ఫ్య్జన్ మాస్టర్ : అంబటి
2024లో ఏపీలో కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావాలి : పవన్ కల్యాణ్
భీమ్లా నాయక్ సినిమాలో త్రివిక్రమ్ ప్రధానంగా చేసిన మూడు మార్పులివేనా..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

