Purushaha Trailer | పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా పురుష (Purushaha). వీరు వులవల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ప్రతీ మగాడి యుద్ధం (విజయం) వెనుక ఓ ఆడది ఉంటుంది. స్వేచ్చ కోసం భర్త చేసే అలుపెరుగని పోరాటం.. అంటూ ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పోస్టర్లు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ మే 22న గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
బ్రహ్మచారి భర్తగా మారాలని నిర్ణయించుకున్న తర్వాత జీవితం యుద్ద భూమిలా మారుతుంది.. అంటూ వెన్నెల కిశోర్ వాయిస్‌తో మొదలైంది ట్రైలర్. పెళ్లాం తిట్టినప్పుడు మన లోపల ఉన్న మగాడు పవర్ ఫుల్‌గా బయటకు వస్తాడు అని వీటీవీ గణేశ్ అంటుంటే.. ఉరి తాడుకు ఒకడే ముడి బిడ్డ. మాంగళ్యానికి మూడు ముళ్లు.. అని అంటున్నాడు సప్తగిరి. ఇక బాగా డిప్రెషన్లో ఉన్నట్టున్నారు.. అంటూ అనంత్ శ్రీరామ్ ఎంట్రీ ఇవ్వడం చూడొచ్చు. అనంత్ శ్రీరామ్ తనదైన స్టైల్లో కామెడీ పండించబోతున్నాడనిపిస్తుంది. బ్రహ్మచారిగా ఉన్న పవన్ కల్యాణ్ ప్రేమ, పెళ్లి చుట్టూ తిరగడంతోపాటు సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్, వెన్నెల కిశోర్‌ల చుట్టూ సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో హింట్ ఇచ్చాడు డైరెక్టర్.
ఈ చిత్రాన్ని బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వర రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, వీటీవీ గణేశ్, అనంత్ శ్రీరామ్, రాజీవ్ కనకాల, పమ్మి సాయి, మిర్చి కిరణ్, గబిరాక్, అనైరా గుప్తా, సప్తగిరి, కసిరెడ్డి రాజ్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
A trailer packed with laughs, energy, and entertainment 😎💥
Watch the #Purushaha Trailer now!
▶️https://t.co/YeB6x4vKtA#Purushaha releasing On May 22!@kalyanb949 @MeSapthagiri @Actor_Rajkumar9 @rayancha2vk @VeeruVulavala #SatishMutyala @vtvganeshoff #PammiSai #Vishika… pic.twitter.com/dMjTcJozGl— SR PROMOTIONS (@SRPROMOTIONS29) May 19, 2026