షారుఖ్‌ఖాన్ కథానాయకుడిగా నటించిన ‘పఠాన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్నది. తాజాగా ఈ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. కేవలం ఎనిమిది రోజుల్లోనే 667 కోట్ల వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. లాంగ్న్‌ల్రో ఈ సినిమా వెయ్యికోట్ల మైలురాయిని అధిగమిస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
భారతదేశ వ్యాప్తంగా 348కోట్లు, విదేశాల్లో 250కోట్ల కలెక్షన్స్‌తో ఈ సినిమా దూసుకుపోతున్నది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పడుకోన్ కథానాయికగా నటించింది. గూఢచారి నేపథ్య కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.