తాను ప్రస్తుతం నటిస్తున్న మూడు చిత్రాలు ‘పఠాన్’, ‘జవాన్’, ‘డంకీ’ సూపర్ హిట్స్ అవుతాయని చెబుతున్నారు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్. ఈ మూడు చిత్రాలపై తనకున్నది కేవలం ఆత్మవిశ్వాసమేనని ఆయన అంటున్నారు. ఈ మూడు సినిమాల కోసం పనిచేస్తున్న క్రమంలోనే వాటి విజయాలపై నమ్మకం ఏర్పడిందన్నది షారుఖ్ మాట. షారుఖ్ మాట్లాడుతూ…‘57 ఏండ్ల వయసులో రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నా. ప్రమాదకర స్టంట్స్‌లో పాల్గొంటున్నా. ఇవన్నీ ఆ కథలు బాగా నచ్చడం వల్లే.
ఆ సినిమాల మీద నమ్మకం ఉండటం వల్లే చేయగలుగుతున్నా. నేను నటిస్తున్న మూడు సినిమాలు గ్యారెంటీగా హిట్ అవుతాయి. నటుడిగా నేను సాధించింది తక్కువేనని భావిస్తా. మా తల్లిదండ్రులు కూడా నేను స్టార్‌గా కంటే మంచి తండ్రిగా నా పిల్లల్ని పెంచుతున్నందుకు గర్వపడతారు’ అని చెప్పారు. తాజాగా ‘డంకీ’ సినిమా కోసం షారుఖ్ సౌదీ అరేబియా వెళ్లారు. ఇక్కడ పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.