Pathaan Movie | ‘పఠాన్’ టీజర్ సరికొత్త రికార్డు..!
Pathaan teaser record | బాలీవుడ్ బాద్షా షారుఖ్ నుండి సినాలుగేళ్ల గ్యాప్ తర్వాత పఠాన్‌తో ప్రేక్షకులను పలకరించడానికి ముస్తాబవుతున్నాడు బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్. ఇటీవలే రిలీజైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.
Pathaan teaser record | బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ఖాన్ నుండి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది. 2018లో వచ్చిన ‘జీరో’ తర్వాత ఇప్పటివరకు ఈయన నుండి మరో సినిమా రాలేదు. మధ్యలో రెండు, మూడు సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేసిన అవి షారుఖ్ అభిమానులను ఖుషీ చేయలేకపోయాయి. ఈయనను వెండితెరపై ఫుల్ లెంగ్త్ రోల్లో చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక నాలుగేళ్ళ గ్యాప్‌ను పూర్తి చేసేందుకు షారుఖ్ మూడు సినిమాలను సెట్స్‌పై ఉంచాడు. అందులో పఠాన్ ఒకటి. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 25న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తున్నారు. ఇటీవలే రిలీజైన టీజర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే తాజాగా పఠాన్ టీజర్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
‘పఠాన్’ టీజర్ సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించింది. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో అత్యధిక మంది వీక్షించిన, లైక్ చేసిన టీజర్‌కు రికార్డు క్రియేట్ చేసింది. టీజర్‌తోనే సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యష్‌రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా యష్‌రాజ్ ఫిలింస్‌లో 50వ చిత్రం కావడం విశేషం. షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొనే నటించింది. జాన్ అబ్రహం కీలకపాత్రలో నటించాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రభుత్వ ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దని ఎమ్మెల్యే మందుల సామేల్కి వినతి
Hunter Road | సౌకర్యవంతమైన సేవల కోసం హంటర్ రోడ్డులో కొత్త బస్ స్టాప్
సారపాకలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Y.S. Sharmila | ఎన్నికల్లో విజయం ప్రజా తీర్పు కాదు..అధికార మదంతో బలవంతపు గెలుపు : వైఎస్ షర్మిల
పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌పై అవగాహన శిబిరం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

