Pathaan Movie | కేజీఎఫ్-2 రికార్డు బ్రేక్.. హిందీ బెల్ట్‌పై పఠాన్ వీర విధ్వంసం..!
ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘పఠాన్’ హవానే కనిపిస్తుంది. సినిమా విడుదలై పదిహేను రోజుల ఇంకా జోరు ఎక్కడా తగ్గడం లేదు. రోజు రోజుకు టిక్కెట్లు భారీగా తెగుతూనే ఉన్నాయి. తొలిరోజు నుండే షారుఖ్ బాక్సాఫీస్‌పై దండయాత్ర కొనసాగిస్తున్నాడు.
Pathaan Movie | ప్రస్తుతం ఎక్కడ చూసిన ‘పఠాన్’ హవానే కనిపిస్తుంది. సినిమా విడుదలై పదిహేను రోజులవుతున్నా ఇంకా జోరు తగ్గడం లేదు. రోజు రోజుకు టిక్కెట్లు భారీగా తెగుతూనే ఉన్నాయి. తొలిరోజు నుండే షారుఖ్ బాక్సాఫీస్‌పై దండయాత్ర కొనసాగిస్తున్నాడు. మొదటిరోజే అనుకుంటే రెండు, మూడు ఇలా వరుసగా ఆరురోజులు వంద కోట్లకు తగ్గకుండా కలెక్షన్లు సాధిస్తూ బాక్సాఫీస్‌పై విరుచుకుపడుతున్నాడు. ఇక తొలివారం పూర్తయ్యే సరికి రూ.650 కోట్లు కలెక్ట్ చేసి కనివిని ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించాడు. తాజాగా షారుఖ్ మరో అరుదైన రికార్డు సాధించాడు.
తాజాగా షారుఖ్ కేజీఎఫ్ రికార్డును బ్రేక్ చేశాడు. కేజీఎఫ్-2 మూవీ హిందీలో రూ.435.33 కోట్ల నెట్ కలెక్షన్లు సాధిస్తే పఠాన్ కేవలం 15రోజుల్లోనే రూ.436.75 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇదే జోరు కొనసాగితే బాహుబలి-2 రికార్డును కూడా ఈజీగా బ్రేక్ చేసే చాన్స్ ఉంది. పైగా మరో వారం వరకు హిందీలో చెప్పుకోదగ్గ సినిమాలేవి రిలీజ్ కావడం లేదు. ఈ టైమ్‌ను వాడుకుంటే హిందీ బెల్ట్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా అరుదైన రికార్డు క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ మూవీ దాదాపుగా రూ.875 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. షారుఖ్‌కు జోడీగా దీపికా పదుకొనే హీరోయిన్గా నటించింది. జాన్ అబ్రహం కీలకపాత్రలో నటించిన ఈ సినిమాను యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు.
#Pathaan – 436.75 (15 days)#KGF2 – 435.33 cr (lifetime)
Hindi version— Box Office (@Box_Office_BO) February 9, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

