Passion Movie | యంగ్ ట్యాలెంటెడ్ హీరో హీరోయిన్స్ సుధీస్, అంకిత జంటగా, అరవింద్ జాషువా దర్శకత్వంలో రూపొందుతున్న ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీ “ప్యాషన్”. REDANT క్రియేషన్ బ్యానర్‌పై నరసింహా యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల లాంచ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ అద్భుతమైన డిజైన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తప్పకుండా గొప్ప విజయం సాధిస్తుందని శేఖర్ కమ్ముల ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫస్ట్ లుక్ లాంచ్ ప్రెస్ మీట్లో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. “అరవింద్ జాషువాతో నాకు ‘ఆనంద్’ సినిమా నుంచి పరిచయం. అప్పట్లోనే అతనిలో స్టోరీ టెల్లింగ్, రైటింగ్, క్రియేటివిటీ ఉన్నాయని గుర్తించాను. అరవింద్ రాసిన ‘ప్యాషన్’ నవల చదివాను, అద్భుతంగా ఉంది. ఫ్యాషన్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన అతను ఈ కథను చాలా అథెంటిక్‌గా రాశాడు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది, అరవింద్‌కు మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంది. నిర్మాతలు కొత్తవాళ్లైనా, వారంతా ప్యాషన్‌తో సినిమాను నిర్మిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ చాలా బాగుంది. కొత్త ఫ్లేవర్‌తో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సినిమా కూడా అద్భుతంగా ఆదరణ పొందుతుందని నమ్ముతున్నాను. టీమ్‌కు నా శుభాకాంక్షలు,” అని అన్నారు.
ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ, ‘ప్యాషన్’’ సినిమా నవలగా ప్రచురితమైన ఛాయా పబ్లికేషన్స్‌కు ధన్యవాదాలు. ఈ నవల చదివిన వారంతా ఇన్స్పైర్ అయ్యారు, అందుకే దీన్ని సినిమాగా తీసుకొచ్చారు. శేఖర్ కమ్ముల గారి ఆశీస్సులు లేకపోతే ఈ సినిమా సాధ్యం కాదు. బిజీ షెడ్యూల్లోనూ ఈ ఈవెంట్‌కు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన ఆయనకు ధన్యవాదాలు. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను,” అని తెలిపారు.
దర్శకుడు అరవింద్ జాషువా మాట్లాడుతూ, “‘ప్యాషన్’ కథ చాలా పెద్ద కాన్వాస్‌పై రూపొందింది. ఫ్యాషన్ కాలేజీలో నాలాంటి సామాన్యుడు చదివితే ఎలా ఉంటుందనే అనుభవం నుంచి ఈ కథ రాశాను. శేఖర్ కమ్ముల గారి శిష్యుడిని, ఆయన ప్యాషన్‌ను చూసి సినిమా ఇండస్ట్రీపై నాకు గౌరవం పెరిగింది. మా నిర్మాతలు, ఛాయా పబ్లికేషన్స్, డిఓపి సురేష్ నటరాజన్, మ్యూజిక్ డైరెక్టర్ సామ్ హెన్రీ, ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు అందరూ అద్భుతంగా సపోర్ట్ చేశారు. సుధీస్, అంకిత ఈ కథకు ప్రాణం పోశారు. ఈ జనరేషన్‌కు కనెక్ట్ అయ్యే ఈ లవ్ స్టోరీ త్వరలో థియేటర్స్‌లోకి రానుంది. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను, అని అన్నారు.
నటీనటులు, సాంకేతిక బృందం
నటీనటులు: సుధీస్, అంకిత, ప్రకాష్ రాజ్, హిమజ, అశ్విన్ ముశర్న్, బెనర్జీ, చందన, అర్చన, ఉదయ్ మహేష్, సూర్య, కన్నడ కిషోర్, యుక్త, అర్జున్, శ్రేయషి, పరిణిత, అన్షుల, అంకిత్ తదితరులు.
ప్రొడక్షన్: REDANT క్రియేషన్
దర్శకుడు: అరవింద్ జాషువా
నిర్మాతలు: నరసింహా యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్
DOP: సురేష్ నటరాజన్
సంగీతం: సామ్ హెన్రీ
ఎడిటర్: నాగేశ్వర రెడ్డి
ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్
కాస్ట్యూమ్ డిజైనర్: శ్రీకాంత్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సుబ్బు RV
పీఆర్వో: తేజస్వి సజ్జా