Satyaprem ki katha Movie | సత్యప్రేమ్ కీ కథ మూవీ పసూరి సాంగ్ రిలీజ్.. అర్జిత్ సింగ్ వాయిస్ అదరహో..!
Satyaprem ki katha Movie Songs | కరోనాతో కష్టకాలంలో పడిపోయినా బాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏడాది క్రితం విడుదలైన ‘భూల్ భూలయ్య-2’ ఊపిరి పోసింది. హార్రర్ బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన ఈ సినిమా రెండొందల కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి విజయ ఢంకా మోగించింది.
Satyaprem ki katha Movie Songs | కరోనాతో కష్టకాలంలో పడిపోయినా బాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏడాది క్రితం విడుదలైన ‘భూల్ భూలయ్య-2’ ఊపిరి పోసింది. హార్రర్ బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన ఈ సినిమా రెండొందల కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి విజయ ఢంకా మోగించింది. ముఖ్యంగా ఈ సినిమాలో కార్తిక్ ఆర్యన్, కియారా అద్వాణీల కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయింది. ఇక ఇప్పుడు అదే మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు ముస్తాబయింది ఈ జంట. వీరిద్దరూ కలిసి తాజాగా ‘సత్య ప్రేమ్ కీ కథ’ సినిమా చేస్తున్నారు. నేషనల్ అవార్డు విన్నర్ సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ లు సినిమాపై తిరుగులేని హైప్ తీసుకొచ్చాయి. రొమాంటిక్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లతో సినిమాపై అటెన్సన్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని పసూరి ను సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఏడాది క్రితం ప్రైవేట్ సాంగ్‌గా వచ్చి యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టిన పసూరి సాంగ్‌ను బిట్‌ను ఈ పాటలో యాడ్ చేసి సరికొత్తగా చూపించారు. ఈ పాటలో కార్తిక్, కియారా డ్యాన్స్ అదిరిపోయింది. ఈ గురువారం విడుదల కాబోతున్న ఈ సినిమాపై హిందీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. పైగా టీజర్, ట్రైలర్లు మంచి హైప్ తీసుకొచ్చాయి. నదియా వాలా గ్రాండ్సన్ ఎంటర్టైనమెంట్స్, నమహా పిక్చర్స్ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

