Parvati Melton | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో జల్సా చిత్రం ఒకటి. ఈ మూవీ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కగా ఇందులోని పవర్ ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులకి పూనకాలు తెప్పించాయి. యుద్ధంలో గెలవడమంటే శత్రువును చంపటం కాదు శత్రువును ఓడించటం అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్ కి థియేటర్ హోరెత్తిపోయింది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌కి జంటగా ఇలియానాతో పాటు పార్వతీ మెల్టన్ నటించింది. పార్వతి 2005లో వచ్చిన వెన్నెల అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం కాగా, ఆ తర్వాత గేమ్, అల్లరే అల్లరి,మధుమాసం సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాలు ఏవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.
జల్సా సినిమాలో నటించే అవకాశం రాగా, అందులో తన పాత్రతో మెప్పించింది. ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసి అలరించింది. ఇక 2012లో వచ్చిన యమహో యమహ సినిమా తర్వాత ఈ అమ్మడు మళ్లీ వెండితెరపై కనిపించలేదు. కాగా సినిమాలకు దూరంగా ఉంటున్న పార్వతి.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన క్యూట్‌నెస్‌తో అలరిస్తూ ఉంటుంది. పార్వతి మెల్టన్ 2012 లో అమెరికాలో ఉన్న బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకొని అక్కడే సెటిల్ అయింది. సినిమాలు మానేసి అక్కడ బిజినెస్‌లు చూసుకుంటూ ఉంది.
తాజాగా పార్వతి మెల్టన్ తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఇవి చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. బేబి బంప్లోను మరీ ఇంత హాట్ గా ఫొటో షూట్ చేయాలా అని అంటున్నారు. మరి కొందరు కాబోయే మామ్ కి కంగ్రాట్స్ అంటూ విషెస్ చెబుతున్నారు. ఇటీవల తన కేరీర్ పై పార్వతి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన కెరీర్ పాడవడానికి కారణం ఇద్దరు డైరెక్టర్స్ అని చెప్పుకొచ్చిన ముద్దుగుమ్మ వారి పేర్లు మాత్రం చెప్పలేదు. కాని అప్పట్లో కొంతమంది డైరెక్టర్ల పేర్లు వినిపించాయి.ఆ డైరెక్టర్లు ఎవరో సినీ ఇండస్ట్రీ గురించి తెలిసిన చాలా మందికి తెలుసు అని పేర్కొంది.