టాలీవుడ్ యువ హీరో కల్యాణ్ దేవ్ (Kalyaan Dhev) నటిస్తోన్న తాజా చిత్రం కిన్నెరసాని (Kinnerasani). రమణతేజ (Ramana Teja) దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా కిన్నెరసాని నుంచి పార్వతీపురం (Parvathipuram song) లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. దారి కాని దారిలోన ఊధు పొదలనా..పెద్దకొడుకు మర్రిచెట్టు నాకు చివరనా..సిచ్చు కంట చెరువు గట్టు తూరుపున్నది..దాసెకొండ బిడ్డ నేను పార్వతీపురం అంటూ సాగుతున్న ఈ పాట సస్పెన్స్ గా క్యూరియాసిటీని కలిగిస్తోంది.
మహతిస్వరసాగర్ కంపోజ్ చేసిన మ్యూజిక్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా కనిపిస్తోంది. ఉమా నేహా, రేవంత్, ధనుంజయ్ సీపానా ఈ పాటను పాడారు. కిట్టు విస్సాప్రగడ రాసిన పాట లిరిక్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. కిన్నెరసాని సినిమా అన్ శీతల్ ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. రవీంద్ర విజయ్, మహతి బిక్షు, కశిష్ ఖాన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తల్లూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. దేశరాజ్ కిన్నెరసానికి కథనందించాడు. మహతి స్వరసాగర్ సమకూర్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రాన్ని మరోస్థాయికి తీసుకెళ్లేలా కనిపిస్తుంది.ఇప్పటికే విడుదల చేసిన కిన్నెరసాని టీజర్ లో కల్యాణ్ దేవ్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించాడు.
Samantha Cycling | వర్షంలో సమంత సైక్లింగ్..వీడియో వైరల్
KondaPolam trailer | నల్లమల అడవిలో శిక్షణ తీసుకున్నా..కొండపొలం ట్రైలర్