Parineeti Chopra | మే 13న ఆప్ ఎంపీతో పరిణీతి ఎంగేజ్మెంట్..? పెండ్లి ఎప్పుడంటే
Parineeti Chopra | మే 13న ఆప్ ఎంపీ (AAP MP) రాఘవ్ చద్దా (Raghav Chadha)తో బాలీవుడ్ (Bollywood) స్టార్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra) ఎంగేజ్మెంట్ జరగనున్నట్లు తెలిసింది.
Parineeti Chopra | ఆప్ ఎంపీ (AAP MP) రాఘవ్ చద్దా (Raghav Chadha) , బాలీవుడ్ (Bollywood) స్టార్ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra) గత కొన్ని రోజులుగా నెట్టింట వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి వరుసగా డిన్నర్ డేట్స్ (Dinner Dates), లంచ్ మీటింగ్స్ (Lunch Meets) అంటూ చట్టాపట్టాలేసుకు తిరగడమే ఇందుకు కారణం. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి కూడా. దీంతో వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారని, త్వరలో వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే, రిలేషన్షిప్ స్టేటస్‌పై ఇప్పటి వరకు వీరిద్దరూ బహిరంగంగా స్పందించలేదు.
తాజా సమాచారం ప్రకారం మరో పది రోజుల్లో ఈ జంటకు నిశ్చితార్థం (Engagement) జరగనున్నట్లు తెలిసింది. మే 13వ తేదీన ఢిల్లీ (Delhi)లో వీరి నిశ్చితార్థ వేడుక జరగనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి వివాహం జరుగుతుందని పేర్కొన్నాయి. ‘పరిణీతి-రాఘవ్ చద్దాల రోకా పూర్తైంది. ఇది కుటుంబ వ్యవహారం. వారిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ఏడాది అక్టోబర్ చివర్లో వీరు వివాహం చేసుకునే అవకాశం ఉంది’ అని వారు చెప్పుకొచ్చారు.
ఢిల్లీలో ఎంగేజ్మెంట్ కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం కోసం పరిణీతి చోప్రా షూటింగ్స్‌ను వాయిదా వేసుకుందని సమాచారం. ప్రస్తుతం ఈ భామ హిందీలో ఛమ్కీలా, క్యాప్య్సుల్ గిల్ చిత్రాల్లో నటిస్తోంది. ఇక రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తరపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
Also Read..
The Kerala Story | ‘ది కేరళ స్టోరీ’కి ఏ సర్టిఫికెట్.. ఆ సన్నివేశాలను తొలగించాలన్న సెన్సార్ బోర్టు
snake venom | బంగ్లా టు భారత్.. రూ.13 కోట్ల విలువైన పాము విషం అక్రమ రవాణా
King Charles Coronation | రాజు పట్టాభిషేకానికి రూ.1000 కోట్లు ఖర్చు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

