snake venom | బంగ్లా టు భారత్.. రూ.13 కోట్ల విలువైన పాము విషం అక్రమ రవాణా
snake venom | బంగ్లాదేశ్ (Bangladesh) నుంచి భారత్ (India)కు అక్రమంగా తరలిస్తున్న పాము విషాన్ని (snake venom) బీఎస్ఎఫ్ దళాలు (Border Security Force) స్వాధీనం చేసుకున్నాయి.
snake venom | బంగ్లాదేశ్ (Bangladesh) నుంచి భారత్ (India)కు అక్రమంగా తరలిస్తున్న పాము విషాన్ని (snake venom) బీఎస్ఎఫ్ దళాలు (Border Security Force) స్వాధీనం చేసుకున్నాయి. బంగ్లా సరిహద్దుల (Bangladesh border) గుండా ఇద్దరు స్మగ్లర్లు (smugglers) భారత్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారని బీఎస్ఎఫ్ (BSF) దళాలకు సమాచారం అందింది. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దక్షిణ దినాజ్‌పూర్ (South Dinajpur ) జిల్లాలోని హిలి (Hili ) ప్రాంతం వద్ద పహన్‌పరా గ్రామంలో కాపు కాశారు.
ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 12:30 గంటల ప్రాంతంలో ఇద్దరు స్మగ్లర్లు దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. గమనించిన భద్రతా దళాలు కాల్పులు జరపడంతో వారు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు. ఆ సమయంలో స్మగ్లర్లు వారి వద్ద ఉన్న ఓ సీసాను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. దానిని భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఆ సీసాలో పాము విషం ఉండటాన్ని గుర్తించిన బీఎస్ఎఫ్ సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు.
సీసాపై ‘మేడ్ ఇన్ ఫ్రాన్స్’ (Made in France) అని కూడా రాసి ఉందని.. బాటిల్లో ఉన్న విషం కోబ్రా పాముదని అధికారులు తెలిపారు. అనంతరం ఆ బాటిల్‌ను అటవీ శాఖ అధికారులకు అప్పగించినట్లు వారు పేర్కొన్నారు. పట్టుబడిన పాము విషం విలువ బ్లాక్ మార్కెట్లో సుమారు రూ.13 కోట్లు ఉంటుందని వారు అంచనా వేశారు.
Also Read..
King Charles Coronation | రాజు పట్టాభిషేకానికి రూ.1000 కోట్లు ఖర్చు
Ukraine | ‘కాళీమాత’ ఫొటోతో వివాదాస్పద ట్వీట్.. క్షమాపణలు చెప్పిన ఉక్రెయిన్
Salman Khan | మహిళల శరీరాలు విలువైనవి.. డ్రెస్ కోడ్ కాంట్రవర్సీపై సల్మాన్ స్పందన
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika Mandanna | సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన రష్మిక మందన్న.. 400 కుటుంబాలకు చేయూత
RS Praveen Kumar | రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా ఆర్పీఎఫ్..! ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం
KCR | ఇదిగో కేసీఆర్ ముందుచూపు.. కరువులోనూ నీళ్లు పారేలా ప్రణాళిక
Singareni | జై కొట్టిన సింగరేణి.. జాతరను తలపించిన నల్లనేల
Harish rao | పాలమూరుకు పట్టిన గ్రహణం రేవంత్.. హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

