Param Sundari | బాలీవుడ్ నటులు జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా కలిసి నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘పరమ్ సుందరి’ ఫస్ట్ లుక్ టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని తుషార్ జలోటా (‘దాస్వి’ ఫేమ్) దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నార్త్ ఇండియాకు చెందిన ‘పరం’ (సిద్ధార్థ్ మల్హోత్రా), సౌత్ ఇండియాకు చెందిన ‘సుందరి’ (జాన్వీ కపూర్) మధ్య ప్రేమకథగా సాగనుంది. వీరిద్దరి మధ్య సాంస్కృతిక భేదాలు, హాస్యభరితమైన సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ చిత్రంలో రాజీవ్ ఖండేల్వాల్, ఆకాష్ దహియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘పరమ్ సుందరి’ చిత్రం జూలై 25, 2025న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ టీజర్లో కేరళలోని అందమైన బ్యాక్‌వాటర్స్, హౌస్బోట్ల నేపథ్యం అద్భుతంగా ఉంది. సిద్ధార్థ్, జాన్వీ ఒక బైక్‌పై రొమాన్స్ చేస్తూ కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో సోను నిగమ్ ఆలపించిన మధురమైన పాట హైలైట్‌గా నిలిచింది.