పంజా వైష్ణవ్‌తేజ్ హీరోగా ఓ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తున్నారు. శ్రీలీల నాయికగా నటిస్తున్నది. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం ఈ చిత్ర విడుదల తేదీని చిత్రబృందం తాజాగా ప్రకటించారు. ఏప్రిల్ 29న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముం దుకు తీసుకొస్తామని తెలిపారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా మేజర్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రానికి ఎడిటర్ : నవీన్ నూలి, సినిమాటోగ్రఫీ : డుడ్లే.