Kareena Kapoor | ప్రభాస్, సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్లో రూపొందనున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘స్పిరిట్’. ఈ ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ క్రేజీ కపుల్ కరీనాకపూర్, సైఫ్ అలీఖాన్‌లు విలన్లుగా నటిస్తున్నారంటూ ఓ వార్త గత కొన్ని రోజులుగా మీడియా సర్కిల్లో ఓ రేంజ్లో హల్చల్ చేస్తున్నది. దీనిపై ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేసింది కరీనా కపూర్.
‘ఇప్పటివరకూ ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించిన ఏ ఒక్కరూ మమ్మల్ని కలవలేదు. మా మధ్య చర్చలు జరిగాయి అన్నది పచ్చి అబద్ధం.’ అని తేల్చి చెప్పేసింది కరీనా. ఇంకా మాట్లాడుతూ ‘సౌత్ సినిమాలో నటించాలని నాకు బలంగా ఉంది. అయితే.. నాకు తగ్గ పాత్ర రావాలి. ఆ పాత్రకు కథలో మంచి ప్రాధాన్యత ఉండాలి. అలాంటి పాత్ర వస్తే తప్పకుండా నటిస్తా. అందరూ అనుకుంటున్నట్టు ‘స్పిరిట్’ ఆఫర్ నా దగ్గరకు వచ్చినా.. పాత్ర నచ్చితేనే చేస్తా. మాకైతే ఎలాంటి సమాచారం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది కరీనా.