ఫామ్ లోకి వచ్చిన రజనీకాంత్ దర్శకుడు.. సార్పట్టకు పాజిటివ్ టాక్
కొందరు దర్శకులకు అద్భుతమైన టాలెంట్ ఉంటుంది.. కానీ వాళ్లకు సరైన విజయాలు మాత్రం రావు. అలాంటి కోవలోకి వచ్చే దర్శకుడు పా రంజిత్. ఈ తరం దర్శకుల్లో ఎవరికీ సాధ్యం కాని విధంగా రజనీకాంత్‌తో వరుసగా రెండు సినిమాలు చేశాడు రంజిత్.

కొందరు దర్శకులకు అద్భుతమైన టాలెంట్ ఉంటుంది.. కానీ వాళ్లకు సరైన విజయాలు మాత్రం రావు. అలాంటి కోవలోకి వచ్చే దర్శకుడు పా రంజిత్. ఈ తరం దర్శకుల్లో ఎవరికీ సాధ్యం కాని విధంగా రజనీకాంత్‌తో వరుసగా రెండు సినిమాలు చేశాడు రంజిత్. నాలుగేళ్ల కింద సూపర్ స్టార్‌తో ఈయన చేసిన కబాలి సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. విడుదలకు ముందు ఈ సినిమా క్రియేట్ చేసిన రికార్డులు మరే సినిమాకు సాధ్యం కాలేదేమో..! అయితే విడుదలైన తర్వాత కబాలి అంచనాలు అందుకోలేకపోయింది. అయినా కూడా ఆ సినిమాలో టేకింగ్ నచ్చి వెంటనే కాలా సినిమా చేశాడు రజినీకాంత్. ఇది కూడా డిజాస్టర్ అయ్యింది. రంజిత్ ఐడియాలజీ బాగానే ఉన్నా.. తెర మీదికి వచ్చే సరికి అవి దారి తప్పుతున్నాయి. దాంతో కమర్షియల్ విజయాలకు దూరంగా ఉన్నాడు రంజిత్.

తొలి సినిమాతోనే దర్శకుడిగా అద్భుత విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు పా రంజిత్. అట్టాకత్తి మూవీతో విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్నాడు. ఆ వెంటనే కార్తితో తీసిన మద్రాస్ సినిమా కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో రజినీకాంత్‌తో వరుస సినిమాలు చేసే అవకాశం కొట్టేసి నేషనల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఆ రెండు సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయాయి. దీంతో మూడేళ్లు గ్యాప్ తీసుకుని మరో సినిమాతో వచ్చాడు పా రంజిత్.

ఆర్య హీరోగా స్వతంత్ర కాలం నాటి కథతో తెరకెక్కించిన సార్పట్టా పరంపర సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. రంజిత్ చాలా సంవత్సరాల తర్వాత తనలోని అసలైన దర్శకుడిని బయటపెట్టాడు అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమా చూసి ఫిదా అవుతున్నారు. స్పోర్ట్స్ డ్రామా అయినా కూడా ఊహకందని ట్విస్ట్‌లతో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు రంజిత్ సినిమా నిడివి మూడు గంటలు ఉన్న కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా పట్టు సడలని స్క్రీన్ ప్లేతో సార్పట్టా ఈ సినిమాను రూపొందించాడు రంజిత్. ఇది చూసిన తర్వాత కచ్చితంగా స్టార్ హీరోలు మళ్లీ రంజిత్ వైపు అడుగులు వేయడం ఖాయంగా కనిపిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
సినిమాలకు యువ హీరో గుడ్‌బై..?
ఇంటి పేరు తెచ్చిన తంటా..కరణ్ కుంద్రాకు చిక్కులు
బాలకృష్ణను భయపెట్టేది ఏంటో తెలుసా..?
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

