OTT | ఇప్పుడు విద్యార్థుల పరీక్షా సమయం. అందుకే నిర్మాతలు ఆచితూచి సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా రిలీజ్‌కి రెడీ కావడం లేదు. కాకపోతే ఛావా, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, కింగ్ స్టన్ వంటి డబ్బింగ్ చిత్రాలు మాత్రం థియేటర్లలో సందడి చేయనున్నాయి.మరోవైపు ఓటిటిలో 11 వెబ్ సిరీసులు సందడి చేయనున్నాయి. వాటిలో రేఖా చిత్రం, తండేల్, బాపు లాంటి సినిమాలు ప్రేక్షకులకి మంచి వినోదం పంచనున్నాయి. అయితే ఈ వారం ఓటీటీల్లో మార్చి 3-9వ తేదీ వరకు రిలీజ్ అయ్యే సినిమాలు చూస్తే.. నెట్ ఫ్లిక్స్ లో విడామయూర్చి (తెలుగు డబ్బింగ్ మూవీ) మార్చి 03 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక తండేల్ (తెలుగు సినిమా) – మార్చి 07, నదానియాన్ (హిందీ హిందీ మూవీ) – మార్చి 07 స్ట్రీమింగ్ కానుంది.
ఇక అమెజాన్ ప్రైమ్ లో చూస్తే.. దుఫాహియా (హిందీ సిరీస్) – మార్చి 07 నుండి స్ట్రీమింగ్ కానుంది. సోనీ లివ్ లో రేఖాచిత్రం (తెలుగు డబ్బింగ్ మూవీ) – మార్చి 07 నుండి, ద వాకింగ్ ఆఫ్ ఏ నేషన్ (హిందీ సిరీస్) – మార్చి 07 నుండి, బుక్ మై షో బారా బై బారా (హిందీ మూవీ) – మార్చి 07 నుండి స్ట్రీమింగ్ కానుంది. హాట్ స్టార్ లో డేర్ డెవిల్: బార్న్ ఎగైన్ (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 04 నుండి స్ట్రీమింగ్ కానుండగా, డెలి బాయ్స్ (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 06 నుండి, బాపు (తెలుగు సినిమా) – మార్చి 07 నుండి, తగేష్ vs ద వరల్డ్ (హిందీ సిరీస్) – మార్చి 07 నుండి స్ట్రీమింగ్ కానుంది.
బుక్ మై షో లో బారా బై బారా (హిందీ మూవీ) – మార్చి 07 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈటీవీ విన్ – ధూం ధాం (తెలుగు – మార్చి 6 నుండి స్ట్రీమింగ్ కానుండగా, జీ5 – కుటుంబస్థాన్ (తమిళ/తెలుగు – మార్చి 7 నుండి స్ట్రీమింగ్ కానుంది. జిగేల్ అనే చిత్రం మార్చి 7నే థియేటర్లలో రిలీజ్ కానుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మార్చి 7న నారి అనే సినిమాను థియేటర్లలోకి తీసుకురానున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ లీడ్ రోల్లో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘కింగ్ స్టన్ ఈ నెల 7న థియేటర్లలోకి రానుంది. ప్రియమణి, కున్‌చకో బొబన్ లీడ్ రోల్స్‌లో నటించిన మలయాళ హిట్ మూవీ ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ కూడా ఈ నెల 7న థియేటర్లలోకి రానుంది. టైమ్ లూప్ హారర్ కాన్సెప్ట్‌తో కన్నడ హీరో ప్రజ్వల్ దేవరాజ్ నటించిన లేటెస్ట్ మూవీ రాక్షస ఈ నెల 7న కన్నడతో పాటు తెలుగులోనూ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. అలానే రారాజా, పౌరుషం, W/O అనిర్వేష్, శివంగి ,నీరుకుళ్ల , 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఈ నెల 7న థియేటర్స్‌లోకి వచ్చి సందడి చేయనున్నాయి.