OTT | ఈ శుక్రవారం థియేటర్లలో పెద్ద సినిమాల సందడి లేకపోయినా, ఓటీటీ వేదికలపై మాత్రం వినోద ప్రియులకు భారీ ట్రీట్ సిద్ధమైంది. ఒకే రోజు దాదాపు 15కు పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్కు సిద్ధమయ్యాయి. మరోవైపు థియేటర్లలో ‘ఒక్కడు’, ‘సినిమా చూపిస్త మావ’ వంటి హిట్ చిత్రాలు రీ-రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరించనున్నాయి.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీ భారతీయ సినీ చరిత్రలో ఓ ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. ఈ సినిమాల వెనుక జరిగిన ప్రయాణం, యుద్ధ సన్నివేశాల రూపకల్పన, మేకింగ్ విశేషాలు, నటీనటుల అనుభవాలను చూపిస్తూ రూపొందించిన డాక్యుమెంటరీ సిరీస్ ‘బాహుబలి: టార్చ్‌బేరర్’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నాలుగు ఎపిసోడ్లతో రూపొందిన ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.
సువిక్షిత్, గీతికా రతన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘దూరదర్శిని’ చిత్రం కూడా ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెట్టింది. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లవ్ ఎంటర్టైనర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది.
కథీర్, దివ్య భారతి, పూర్ణిమ రవి, రాధిక శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘లింగం’ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రశాంత్ పాండియన్ తెరకెక్కించిన ఈ సిరీస్‌పై తమిళ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.
హారర్ కథలను ఇష్టపడే ప్రేక్షకుల కోసం ‘ముత్తాశి’ అనే కొత్త థ్రిల్లర్ సిరీస్ ZEE5లో అందుబాటులోకి వచ్చింది. నందులాల్ ఎంఎస్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో కేపీఏసీ లీల, అమిత్ చకాలక్కల్, అఖిలా భార్గవన్ కీలక పాత్రలు పోషించారు.
‘మమ్ముట్టియాన్ స్టార్స్’ – ZEE5
‘అలియన్స్’ (హిందీ రియాలిటీ షో) – అమెజాన్ ప్రైమ్ వీడియో
‘ది బియర్ సీజన్ 5’ – జియో హాట్‌స్టార్
‘కొత్త కొత్తగా’ – ఈటీవీ విన్
‘ఛాయా చిత్రం’ – ఈటీవీ విన్
‘ది కేరళ కుట్టీ’ – ఈటీవీ విన్
‘లిటిల్ బ్రదర్’ – నెట్‌ఫ్లిక్స్
‘నోట్స్ ఫ్రమ్ ది లాస్ట్ రో’ – నెట్‌ఫ్లిక్స్
‘ఏజెంట్ కిమ్ రీయాక్టివేటెడ్’ – నెట్‌ఫ్లిక్స్
‘సేవేజ్ హౌస్’ – అమెజాన్ ప్రైమ్ వీడియో
‘ఫర్బిడెన్ ఫ్రూట్స్’ – షడర్
‘స్ట్రంగ్’
‘అండర్ టోన్’ – HBO Max
మొత్తంగా ఈ వారాంతంలో థియేటర్ల కంటే ఓటీటీల్లోనే వినోదపు సందడి ఎక్కువగా కనిపిస్తోంది. యాక్షన్, హారర్, డాక్యుమెంటరీ, లవ్ స్టోరీ, థ్రిల్లర్, వెబ్ సిరీస్‌లు ఇలా అన్ని రకాల కంటెంట్ ఒకేసారి అందుబాటులోకి రావడంతో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీగా కనిపిస్తోంది.