OTT ఎఫెక్ట్ : ఓవర్సీస్లో టాలీవుడ్‌కు ఊహించని దెబ్బ !

OTT | తెలుగు సినిమాలకు ఏపీ, నైజాం ఎలా అయితే అద్భుతమైన కలెక్షన్లు తీసుకొస్తాయో.. వాటి తర్వాత ఓవర్సీస్ మార్కెట్ కూడా అలాగే కలెక్షన్లను తీసుకొస్తాయి. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్‌కు ఓవర్సీస్ అనేది అక్షయ పాత్ర. అక్కడి నుంచి ఎప్పుడూ ఎంత డబ్బు వస్తుందో ఎవరు ఊహించలేరు. కొన్ని చిన్న సినిమాలకు ఇక్కడ కంటే యూఎస్ మార్కెట్లో ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. ఒకప్పుడు కేవలం లక్షల్లో మాత్రమే ఓవర్సీస్ నుంచి కలెక్షన్స్ వచ్చాయి. కానీ కొన్నేండ్లుగా విదేశీ మార్కెట్ అత్యంత కీలకంగా మారిపోయింది. అక్కడి ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని మన దర్శక నిర్మాతలు సినిమాలు తీసే స్థాయికి ఓవర్సీస్ మార్కెట్ డామినేట్ చేయడం మొదలు పెట్టింది.
మహానటి, శ్రీమంతుడు, రంగస్థలం సినిమాలు ఓవర్సీస్లో భారీ కలెక్షన్స్ వసూలు చేశాయి. అయితే గత రెండేళ్లుగా ఓవర్సీస్ మార్కెట్ ప్రశ్నార్థకంగా మారిపోయింది. కరోనా వైరస్ వచ్చిన తర్వాత మన సినిమాలు అక్కడ ఊహించనంత వసూలు చేయడం లేదు. రెండేళ్ల కింది వరకు ఓవర్సీస్లో తెలుగు టాప్ హీరోలకు అద్భుతమైన మార్కెట్ ఉండేది. ఒక్కొక్కరూ రెండు నుంచి మూడు మిలియన్ డాలర్స్ వసూలు చేసే వాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. వన్ మిలియన్ డాలర్స్ వసూలు చేయడమే గగనమైపోయింది. కోవిడ్ తర్వాత విడుదలైన సినిమాల్లో కేవలం జాతిరత్నాలు మాత్రమే వన్ మిలియన్ ఓవర్సీస్లో క్రాస్ చేసింది. పవన్ కళ్యాణ్ వకీల్‌సాబ్, విజయ్ మాస్టర్ లాంటి సినిమాలకు కూడా ఓవర్సీస్ మార్కెట్ వర్కౌట్ కాలేదు.
కరోనా సెకండ్ వేవ్ తర్వాత పరిస్థితులు మరింత దారుణంగా మారిపోయాయి. ప్రస్తుతం అక్కడ ఆడియన్స్ ఇంటి నుంచి బయట అడుగుపెట్టడానికి ఆలోచిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఓటీటీలో వచ్చే సినిమాలతోనే వారు సర్దుకుంటున్నారు. పైగా మన నిర్మాతలు పెద్ద సినిమాలను కూడా నేరుగా డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు. దీంతో థియేటర్స్‌కు వెళ్లే అవసరం లేకుండా పోతుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఆడియన్స్.. థియేటర్లకు రావడమే మానేస్తారని థియేటర్ల ఓనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Nani vs Theater Owners | సీన్ యూ టర్న్.. నానికి క్షమాపణలు చెప్పిన థియేటర్స్ అసోసియేషన్
రకుల్ ప్రీత్ సింగ్‌కు బంపర్ ఆఫర్ ఇస్తున్న అల్లు అర్జున్
ఈ హీరోయిన్ నాన్‌స్టాప్‌గా 48 గంటలు పడుకుంటుందట..!
KOTA: నమస్కారం చెప్పా, వెంటనే బాలయ్య నాపై ఉమ్మాడు: కోట
ప్రభాస్ ను పెళ్లి చేసుకోవాలనుందట..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్‌కు భారీ ఊరట
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

