Operation Sindoor | ఆపరేషన్ సిందూర్.. సెలబ్రిటీల స్పందన ఇదే..!
Operation Sindoor | పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ చేపట్టింది. తాజాగా ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్‌కు ధీటైన జవాబిచ్చింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాది స్థావరాలపై వైమానిక దాడులు చేసినట్టు భారత రక్షణ శాఖ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. పాకిస్తాన్‌తో పాటు పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాది ప్రాంతాలను గుర్తించి నాశనం చేసినట్టు పేర్కొన్నారు
Operation Sindoor | పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ చేపట్టింది. తాజాగా ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్‌కు ధీటైన జవాబిచ్చింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాది స్థావరాలపై వైమానిక దాడులు చేసినట్టు భారత రక్షణ శాఖ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. పాకిస్తాన్‌తో పాటు పీఓకేలోని తొమ్మిది ఉగ్రవాది ప్రాంతాలను గుర్తించి నాశనం చేసినట్టు పేర్కొన్నారు. పహల్గామ్‌దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి, ఎందరో మహిళల నుదుటి సిందూరం తుడిచేసిన కారణంగానే ఈ ఆపరేషన్‌కు ‘సింధూర్’ అని నామకరణం చేసినట్టు తెలుస్తుంది. ఇండియన్ ఆర్మీ, ఇండియా ఎయిర్ ఫోర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టగా దీనికి పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు మద్దతు పలుకుతున్నారు.
భారత సైన్యం విజయవంతంగా ‘ఆపరేషన్ సిందూర్’ ను అమలు చేసినట్టు వార్తలు వచ్చిన వెంటనే బాలీవుడ్ సినీ ప్రముఖులు భారత రక్షణ దళాల వీరోచిత చర్యను అభినందిస్తూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. నటుడు రితేష్ దేశ్‌ముఖ్, దర్శకుడు మధుర్ భండార్కర్ ఆపరేషన్ సిందూర్ పై స్పందించారు. ఎక్స్ లో రితేష్ దేశ్‌ముఖ్, “జై హింద్ కి సేన… భారత్ మాతా కి జై!!! #OperationSindoor” అంటూ ప్రౌడ్‌గా ట్వీట్ చేశారు.ఇక మధుర్ భండార్కర్ కూడా స్పందిస్తూ, “మన దళాల కోసం ప్రార్థనలు చేద్దాం. ఒకే దేశం, మనమంతా ఒక్కటిగా ముందుకు సాగుదాం. జై హింద్, వందేమాతరం అంటూ ఆయన రాసుకొచ్చారు.
ఇక సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఆపరేషన్ సిందూర్ పై స్పందించారు. ‘భారత్ మాతా కీ జై’ అని పోస్ట్ చేశారు. భారత్ మాతా కి జై న్యాయం జరిగింది అని ఖుష్బూ అన్నారు.మా ప్రార్ధనలన్నీ కూడా బలగాలతోనే ఉంటాయి. కలిసి ముందుకు సాగుదాం అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. కాగా, భారత సైన్యం అధికారిక ఖాతాలో “న్యాయం జరిగింది. జై హింద్ అనే ప్రకటనతో ఆపరేషన్ విజయాన్ని ధృవీకరించింది. యూనియన్ మంత్రులు కిరణ్ రిజిజు , బండి సంజయ్ కుమార్ కూడా సైన్యాన్ని అభినందించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ఇది సముచిత ప్రతీకారం అని వారు పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

