సందీప్‌కిషన్ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ అడ్వెంచర్ ‘ఊరు పేరు భైరవకోన’. హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చివరి దశ చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా గురువారం రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో హీరో సందీప్‌కిషన్ చేతిలో మంత్రదండం పట్టుకొని కనిపిస్తున్నారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘భైరవకోనలో జరిగే అనూహ్య ఘటనలు, వాటి వల్ల చోటు చేసుకునే పరిణామాలు ఆద్యంతం ఉత్కంఠను పంచుతాయి. సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ నేపథ్యంలో కథ నడుస్తుంది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తున్నది’ అన్నారు. కావ్యథాపర్, వర్ష బొల్లమ్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: శేఖర్ చంద్ర, సమర్పణ: అనిల్ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.ఐ.ఆనంద్.