Okkadu Movie Re-Release Trailer | మహేష్ బాబు కెరీర్లో బెస్ట్ మూవీస్ లిస్ట్ తీస్తే అందులో ‘ఒక్కడు’ మూవీ టాప్ ప్లేస్‌లో ఉంటుంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించింది. ‘టక్కరి దొంగ’, ‘బాబీ’ వంటి బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మహేష్‌కు.. ఈ సినిమా కెరీర్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. రూ.14 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.30 కోట్ల షేర్‌ను సాధించి డబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మహేష్ బాబు-భూమిక కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక మణిశర్మ సంగీత సినిమాకు మరో ఆకర్షణ. తన మ్యూజిక్‌తో మేజిక్ చేశాడు. ఇప్పటికే ఈ సినిమా పాటలను మనం వింటూనే ఉంటాం.
కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతితో 20ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఒక్కడు సినిమాను మేకర్స్ రీ-రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా రీ-రిలీజ్‌కు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గట్లు ట్రైలన్‌ను బాగా కట్ చేశారు. మహేష్‌బాబు కట్ షాట్స్ బాగున్నాయి. చివర్లో వర్షంలో మహేష్‌బాబు కోపంతో చూస్తున్న షాట్ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్‌పై రూపొందిన ఈ సినిమాను జనవరి 7న 4కే వెర్షన్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ప్రస్తుతం మహేష్‌బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.