హీరో సాయిరామ్‌శంకర్ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘ఒక పథకం ప్రకారం’. వినోద్‌కుమార్ విజయన్ దర్శకుడు. వినోద్‌కుమార్ విజయన్, గార్లపాటి రమేష్ నిర్మాతలు. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 7న విడుదల చేయనున్నారు. ప్రమోషన్లో భాగంగా శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ‘ఓ మంచివాడి లోపల ఓ చెడ్డవాడు ఉంటాడు.. ఓ చెడ్డవాడి లోపల చెడ్డవాడు మాత్రమే ఉంటాడు..’ అనే వాయిస్ ఓవర్‌తో ఈ ట్రైలర్ మొదలైంది. క్రైమ్, మర్డర్ కథనాలను చూపిస్తూ హీరోనే విలనా? అనే సందేహంతో ఈ ట్రైలర్ ముగిసింది. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇదొక భిన్నమైన కథ. ఇందులో అడ్వకేట్‌గా సాయిరామ్‌శంకర్ నటిస్తుండగా, పోలీసు పాత్రలో సముద్రఖని కనిపిస్తారు. ఇద్దరి నటనా పోటాపోటీగా ఉంటుంది. ఊహించని మలుపులతో ఉత్కంఠను కలిగించే క్రైమ్ మిస్టర్ ఇది’ అని తెలిపారు. శ్రుతి సోధి, ఆశిమ నర్వాల్, రవి, భానుశ్రీ, గార్లపాటి కల్పలత, పల్లవి గౌడ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజీవ్ రవి, సంగీతం: రాహుల్ రాజ్, నేపథ్య సంగీతం: గోపీసుందర్,