OG | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ (OG) ప్రస్తుతం విడుదలకు రెడీ అవుతోంది. యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ ప్యాన్-ఇండియా గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌ను DVV ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై DVV దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ సింగిల్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.”ఓజీ”లో పవన్ కళ్యాణ్ పాత్ర యాక్షన్, మాస్ మేనరిజంలతో ప్యాక్ అయి ఉండనుందని చిత్రబృందం హింట్ ఇచ్చింది.
చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో ప్రధాన విలన్‌గా కనిపించనున్నాడు. అలాగే అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే విడుదలైన ఓ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో, మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. తాజాగా వినాయక చవితి కానుకగా (ఆగస్టు 27న) ఓ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్‌ను రెండో పాటగా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
సువ్వి సువ్వి అంటూ సాగే మెలోడి పాటని వినాయక చవితి సందర్భంగా ఆగస్ట్ 27న ఉదయం 10.08 ని.లకి విడుదల చేయనున్నట్టు పోస్టర్ ద్వారా ప్రకటించారు. పోస్టర్లో పవన్, ప్రియాంక లుక్ ఆకట్టుకుంటుంది. ఈ పాట కూడా శ్రోతలని ఎంతగానో ఆకట్టుకోనుందని తెలుస్తుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో భారీ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా షూటింగ్ దశలో ఉంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతుంది. పవన్ అభిమానులు ఇప్పటికే “హరిహర వీరమల్లు” చిత్రంతో కొంత నిరాశకు గురైన నేపథ్యంలో, “ఓజీ”పై భారీ ఆశలు పెట్టుకున్నారు. మాస్ యాక్షన్, స్టైలిష్ ప్రెజెంటేషన్‌తో కూడిన ఈ సినిమా అభిమానులకు ఫెస్టివల్‌గా మారనుంది.