OG Movie Teaser Time | ఒక టీజర్ కోసం ఈ రేంజ్లో హడావిడి ఎప్పుడూ చూడలేదు. కొత్త సినిమాలు రిలీజైతే ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎగ్జైట్ అవుతారో ఓజీ టీజర్ గురించి కూడా అదే స్థాయిలో ఎగ్జైట్కు గురవుతున్నారు. దానికి తగ్గట్లే మేకర్స్ సైతం టీజర్ గురించి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లు ఇస్తూ ఎక్కడలేని హైప్‌ను తీసుకొస్తున్నారు. ఇక సెప్టెంబర్ 2న టీజర్ వస్తుందని తెలుసు కానీ.. ఫలానా టైమ్ అని మేకర్స్ ఇప్పటివరకు ప్రకటించలేదు. దీని గురించి ట్విట్టర్లో పవన్ ఫ్యాన్స్ డీవివి సంస్థను ట్యాగ్ చేసి టైమ్ చెప్పండంటూ కామెంట్స్ చేస్తున్నారు. దానికి డీవివి సంస్థ ఫ్యాన్స్‌కు గాడ్ లెవల్ రిప్లయి ఇచ్చింది.
పవన్ బర్త్‌డేన అంతా పండగే కాబట్టి మీరే చెప్పిండి. సెప్టెంబర్ 2న ఏ టైమ్‌కు టీజర్ రిలీజ్ చేద్దామో అని పోస్ట్ చేసింది. అంతేకాకుండా ఫ్యాన్స్ అందరి రెస్పాన్స్ చూసి సాయంత్రం టైమ్‌ను ఫిక్స్ చేస్తామని వెల్లడించింది. దాంతో పవన్ ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. పవన్ పుట్టింది ఉదయం 11.02 నిమిషాలకు.. అదే టైమ్ ఫిక్స్ చేయండంటూ పలువురు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 72 సెకండ్ల నిడివి గల ఓజీ టీజర్ అర్జున్ దాస్ వాయిస్ ఓవర్‌తో ఉండనుందని తెలుస్తుంది. ఫ్యాన్స్ సహా అందరు సినీ ప్రేమికులు టీజర్ చూసి ఆహా ఓహో అనాల్సిందేనని ఇన్సైడ్ టాక్.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్‌కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. అర్జున్ దాస్, శ్రియా రెడ్డిలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.
Aaaroju anthaa Pandage kaaabatti… Meere Cheppandi… Sept 2nd ye time ki cheddaamo..:)
Eeroju Evening ki final ga oka time fix avudaaam fans andari response chusi. #HUNGRYCHEETAH #TheyCallHimOG https://t.co/VJon3wHY6J
— DVV Entertainment (@DVVMovies) August 31, 2023