OG Movie Latest Update | పవన్ కళ్యాణ్ లైనప్‌లో అందరినీ ఎగ్జైట్మెంట్కు గురి చేస్తున్న మూవీ ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎక్కడలేని అంచనాలు నెలకొన్నాయి. ఒక్క ప్రీలుక్ పోస్టర్‌తోనే సోషల్ మీడియా షేక్ అయిందంటే.. ఇక సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అనే ఊహే గూస్బంప్స్ తెప్పిస్తుంది. పైగా ఈ సినిమాలో పవన్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపిస్తున్నాడు. అప్పుడెప్పుడో పుష్కర కాలం ముందు పవన్ ‘పంజా’లో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించాడు. మళ్లీ ఇనేళ్ల తర్వాత గ్యాంగ్‌స్టర్ పాత్ర చేస్తుండటంతో సినిమాపై ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది. తాజాగా చిత్రబృందం ముంబై షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది.
ఇక తదుపరి షెడ్యూల్లో కోసం మహాబలేశ్వర్కు వెళ్లింది.. ఇక మంగళవారం పవన్ కళ్యాణ్, ప్రియాంకల మీద మహాబలేశ్వర్‌లో పాట షూటింగ్‌ను స్టార్ట్ చేయబోతున్నారట. మూడు రోజుల షెడ్యూల్లో ఈ పాటను ఫినీష్ చేయనున్నారట. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్‌ను నిర్మించిన దానయ్య ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా కోసం పవన్ 60రోజుల కాల్షీట్లు ఇచ్చాడని తెలుస్తుంది. ఇక ఈ ఏడాది చివరి కల్లా టాకీ పార్ట్ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలిని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.