నువ్వు సిన్నబోకే నా శ్రీలత
సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ పతాకాలపై రానున్న తెలంగాణ నేపథ్య కుటుంబకథా చిత్రం ‘ఇడుపు కాయితం’. ప్రియదర్శి హీరోగా, తెలంగాణ జానపద గీతాల ద్వారా పేరు తెచ్చుకున్న నాగదుర్గ కథానాయికగా నటిస్తున్న చిత్రానికి వంశీరెడ్డి దొండపాటి దర్శకుడు. బన్నీ వాస్ నిర్మాత. మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ‘శ్రీలత..’ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు.
సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ పతాకాలపై రానున్న తెలంగాణ నేపథ్య కుటుంబకథా చిత్రం ‘ఇడుపు కాయితం’. ప్రియదర్శి హీరోగా, తెలంగాణ జానపద గీతాల ద్వారా పేరు తెచ్చుకున్న నాగదుర్గ కథానాయికగా నటిస్తున్న చిత్రానికి వంశీరెడ్డి దొండపాటి దర్శకుడు. బన్నీ వాస్ నిర్మాత. మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ‘శ్రీలత..’ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘శ్రీలత శ్రీలత శ్రీలత.. నువ్వు సిన్నబోకే నా శ్రీలత.. శ్రీలత శ్రీలత శ్రీలత.. ఈ శ్రీనివాసుడే నీ జత.. జీలకర బెల్లాన్ని పెట్టినా.. ఆ నెత్తిపై భారాన్ని పెట్టనే..’ అంటూ సాగే ఈ పాటను అలరాజు రాయగా, సురేశ్ బొబ్బిలి స్వరపరిచారు.
శంకర్‌బాబు, మోహన్ భోగరాజు ఆలపించారు. ఈ పాటలో హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ పాటను చిత్రీకరించిన లొకేషన్లు, పిల్లలతో చేయించిన డ్యాన్స్ సీక్వెన్సులు పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ అంటున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ తొలివారం విడుదల చేయనున్నారు. శివజ్యోతి, సుజాత, చంద్రవ్వ, మౌనికరెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎంఎన్ బాల్‌రెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

