NTR 31 | కేజీఎఫ్‌తో కన్నడ సినీ ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకొని సలార్ (Salaar)తో ఇండియన్ సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాడు దర్శకుడు ప్రశాంత్ నీల్ (PrashanthNeel). ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించాయి. ప్రస్తుతం ఎన్టీఆర్‌తో ఎన్టీఆర్ 31 తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా రీసెంట్గా పూజ కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే. పూజ అయితే జరుపుకుంది కానీ ఇప్పటివరకు సెట్స్ మీదకి అయితే వెళ్లలేదు. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా ఎప్పుడెప్పుడూ అప్డేట్స్ ఇస్తారా అని అటు తారక్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి సాలిడ్ అప్డేట్ను తారక్ పంచుకున్నాడు.
ఎన్టీఆర్ కథానాయకుడిగా వస్తున్న తాజా చిత్రం దేవర. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా.. NTR 31 సినిమా గురించి తారక్ మాట్లాడాడు. NTR 31 సినిమా షూటింగ్ అక్టోబర్ 21 నుంచి ప్రారంభంకాబోతుంది. ఫస్ట్ షెడ్యూల్ 40 రోజుల పాటు జరగనుంది. అయితే ఈ షూటింగ్లో నేను నటించట్లేదు. ఈ షూట్లో ఇతర నటీనటులకు సంబంధించిన షూట్ చేయనున్నారు. నేను జనవరిలో ఈ షూట్లో పాల్గోంటాను అని తారక్ చెప్పుకోచ్చాడు.
ఈ సినిమాను కూడా ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఒకవేళ ఇదే నిజమైతే తారక్ ఫ్యాన్స్‌కు పండగే అని చేప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ రెండు పార్టులుగా తీయగా.. అవి ఆల్ టైం బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. మరోవైపు సలార్ కూడా రెండు పార్టులుగా వస్తుంది. ఫస్ట్ పార్ట్ ఇప్పటికే సూపర్ హిట్ అవ్వగా రెండో పార్ట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ 31 కూడా రెండు పార్టులుగా రానుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉండనున్నట్లు తెలుస్తుంది.